Radhakrishna: సమయాలు కఠినం

మరోసారి సినిమాలు వాయిదాని ప్రకటిస్తున్న సమయమిది. కరోనా, ఒమిక్రాన్‌ పరిస్థితుల ప్రభావంతో ఇప్పటికే ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’, ‘జెర్సీ’ సినిమాలు వాయిదా పడ్డాయి. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ‘రాధేశ్యామ్‌’ విడుదలపైన సందేహాలు తలెత్తాయి.

Updated : 05 Jan 2022 07:03 IST

రోసారి సినిమాలు వాయిదాని ప్రకటిస్తున్న సమయమిది. కరోనా, ఒమిక్రాన్‌ పరిస్థితుల ప్రభావంతో ఇప్పటికే ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’, ‘జెర్సీ’ సినిమాలు వాయిదా పడ్డాయి. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ‘రాధేశ్యామ్‌’ విడుదలపైన సందేహాలు తలెత్తాయి. కానీ చిత్రబృందం అనుకున్న సమయానికే విడుదల చేస్తామని ప్రకటిస్తూ వచ్చింది. తాజాగా ఆ చిత్ర దర్శకుడు చేసిన ట్వీట్‌ సినీ అభిమానుల్లో చర్చకి దారి తీసింది.  ‘‘సమయాలు కఠినమైనవి. హృదయాలు బలహీనంగా ఉన్నాయి, మనసస్సులు అల్లకల్లోలంగా ఉన్నాయి. జీవితం మనపై ఏది విసిరినా మన ఆశలు ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటాయి’’ అంటూ ట్వీట్‌ చేశారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌. ఆ ట్వీట్‌నిబట్టి ‘రాధేశ్యామ్‌’ వాయిదా పడుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 10న చిత్రబృందం తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభాస్‌ కథా నాయకుడిగా నటించిన చిత్రమిది. పూజాహెగ్డే కథానాయికగా నటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని