RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదలపై స్టే విధించండి: హైకోర్టులో పిల్‌

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంపై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలైంది. అల్లూరి సీతారామరాజు, కొమురం భీం చరిత్రను

Updated : 05 Jan 2022 15:18 IST

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంపై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలైంది. అల్లూరి సీతారామరాజు, కొమురం భీం చరిత్రను వక్రీకరించారంటూ పశ్చిమగోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య ఈ పిల్‌ దాఖలు చేశారు. ఈ సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వొద్దని.. విడుదలపై స్టే విధించాలని కోరారు. జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ వెంకటేశ్వరరెడ్డి ధర్మాసనం ముందుకు ఈ పిల్‌ విచారణకు వచ్చింది. పిల్‌ కాబట్టి సీజే ధర్మాసనం విచారణ జరుపుతుందని జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ధర్మాసనం తెలిపింది.

జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రమిది. పీరియాడికల్‌ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో అల్లూరిగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటించారు. ఆలియాభట్‌, ఒలివియా మోరిస్‌ కథానాయికలు. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం అందించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ పాన్‌ ఇండియా చిత్రం జనవరి 7న విడుదలకావాల్సి ఉండగా ప్రస్తుత కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా వాయిదా పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని