The Family Man: ది ఫ్యామిలీమ్యాన్‌-2 పాత్రలు చెప్పిన ఫస్ట్‌, లాస్ట్‌ డైలాగ్స్‌

మనోజ్‌ బాజ్‌పాయ్‌, సమంత, ప్రియమణి కీలక పాత్రల్లో రాజ్‌, డీకే తెరకెక్కించిన వెబ్‌సిరీస్‌ ‘ది ఫ్యామిలీమ్యాన్-2’.

Published : 04 Dec 2021 15:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మనోజ్‌ బాజ్‌పాయ్‌, సమంత, ప్రియమణి కీలక పాత్రల్లో రాజ్‌, డీకే తెరకెక్కించిన వెబ్‌సిరీస్‌ ‘ది ఫ్యామిలీమ్యాన్-2’. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదలైన ఈ సిరీస్‌ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా టాస్క్‌ ఆఫీసర్‌గా మనోజ్‌, తమిళ రెబల్‌గా సమంత తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఈ సిరీస్‌లోని పాత్రలు చెప్పే మొదటి, చివరి డైలాగ్స్‌ ఇవేనంటూ అమెజాన్‌ ప్రైమ్‌ ఓ వీడియోను పంచుకుంది. మనోజ్‌ తన పిల్లలను స్కూల్‌లో దింపిన తర్వాత వచ్చే సంభాషణలు, చివరిగా ప్రధాని నుంచి అవార్డు అందుకున్న తర్వాత తన సీనియర్‌ అధికారి దగ్గరకు వెళ్లి ‘సర్‌ ప్రధాని ఏ సాయం కావాలన్నా అడగమన్నారు. వడ్డీరహిత హోమ్‌లోన్‌ ఇవ్వమని అడగనా’ అనడం నవ్వులు పూయించింది. సమంత పలికిన సంభాషణలు భావోద్వేగాన్ని కలిగిస్తున్నాయి.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు