Jayamma Panchayathi: తిప్పగలనా చూపులు నీ నుంచి..!

ప్రియురాలు ఎదుట ఉంటే.. ఏ ప్రియుడైనా ఎలా చూపు తిప్పుకోగలడు... అందుకే ‘‘తిప్పగలనా చూపులు నీ నుంచి ఏ వైపైనా...? ఆపగలనా అడుగులు

Updated : 29 Jun 2023 17:42 IST

ప్రియురాలు ఎదుట ఉంటే.. ఏ ప్రియుడైనా ఎలా చూపు తిప్పుకోగలడు... అందుకే ‘‘తిప్పగలనా చూపులు నీ నుంచి ఏ వైపైనా...? ఆపగలనా అడుగులు నా చెంతే కాసేపైనా?’’ అంటు పాడుకుంటున్నాడు. ప్రముఖ యాంకర్‌ సుమ ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ‘జయమ్మ పంచాయతి’లోని ఈ పాటను ప్రముఖ కథానాయకుడు నాని మంగళవారం విడుదల చేశారు. ఎం.ఎం.కీరవాణి సంగీతమందించిన ఈ పాటకు రామాంజనేయులు సాహిత్యమందించారు. విజయ్‌కుమార్‌ కలివారపు దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. దినేష్‌, షాలిని, దేవీప్రసాద్‌... ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు.  ఓ అందమైన ప్రేమ  కథను ఈ పాటలో చూపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని