NBK 107: బాలయ్య-గోపీచంద్‌ మూవీలో పవర్‌ఫుల్‌ స్టార్‌

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సరికొత్త చిత్రం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. పవర్‌ఫుల్‌ కథాంశంతో మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధం కానుంది. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న....

Updated : 03 Jan 2022 10:58 IST

చిత్రబృందం అధికారిక ప్రకటన

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సరికొత్త చిత్రం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. పవర్‌ఫుల్‌ కథాంశంతో మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధం కానుంది. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకొన్న ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ మరికొన్ని రోజుల్లో పట్టాలెక్కనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ ఓ అప్‌డేట్‌ ఇచ్చింది. కన్నడ పాపులర్‌ స్టార్‌ ‘దునియా’ విజయ్‌ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని తెలిపింది. ఈ మేరకు టీమ్‌లోకి ఆయన్ని ఆహ్వానిస్తూ సోమవారం ఉదయం ట్వీట్‌ పెట్టింది.

చిన్న చిత్రాలతో నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన విజయ్‌ ‘దునియా’ సినిమాతో ఫేమస్‌ అయ్యారు. ‘ఆర్‌ఎక్స్‌ సూరి’,  ‘కంఠీరవ’, ‘వీర బాహు’, ‘జాక్సన్‌’ వంటి సినిమాల్లో నటించారు. తెలుగులో ఆయన నటిస్తున్న తొలిచిత్రమిదే. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో బాలయ్య సరసన నటి శ్రుతిహాసన్‌ సందడి చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ‘NBK 107’గా ప్రచారంలో ఉంది.

Read latest Cinema News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు