Salmankhan: సల్మాన్‌ఖాన్‌ బర్త్‌డే.. బీఎండబ్ల్యూ కారు, డైమండ్‌ బ్రాస్‌లెట్‌, ఫ్లాట్‌..!

బాలీవుడ్‌ స్టార్‌హీరో సల్మాన్‌ఖాన్‌ ఇటీవల తన 56వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పాన్వేల్‌లోని ఫాంహౌస్‌లో జరిగిన ఈ వేడుకలు కుటుంబసభ్యులు, స్నేహితులు హాజరై కానుకలు అందచేశారు....

Updated : 30 Dec 2021 12:34 IST

భారీ కానుకలిచ్చిన కుటుంబసభ్యులు, కోస్టార్స్‌

ముంబయి: బాలీవుడ్‌ స్టార్‌హీరో సల్మాన్‌ఖాన్‌ ఇటీవల తన 56వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పాన్వేల్‌లోని ఫాంహౌస్‌లో జరిగిన ఈ వేడుకలు కుటుంబసభ్యులు, స్నేహితులు హాజరై ఖరీదైన గిఫ్ట్‌లు అందచేశారు. బీఎండబ్ల్యూ కారు, డైమండ్‌ బ్రాస్‌లెట్‌ వంటివి ఈ బహుమతుల జాబితాలో ఉన్నాయి. ఇంతకీ సల్మాన్‌కు ఎవరెవరు ఏయే బహుమతులు అందించారంటే..

నటి కత్రినాకైఫ్‌ సుమారు రూ.3లక్షలు పెట్టి సల్మాన్‌ కోసం ప్రత్యేకంగా బంగారపు బ్రాస్‌లెట్‌ను పంపించారట. జాక్వెలిన్‌.. స్పెషల్‌ వాచ్‌ (రూ.12 లక్షలు), సంజయ్‌ దత్‌.. డైమండ్‌ బ్రాస్‌లెట్‌ (రూ.8 లక్షలు), అనిల్‌కపూర్‌.. జాకెట్‌ (రూ.29 లక్షలు), శిల్పాశెట్టి.. డైమండ్‌ అండ్‌ గోల్డ్‌ బ్రాస్‌లెట్‌ ( రూ. 17 లక్షలు), సల్మాన్‌ఖాన్‌ సోదరి అర్పితాఖాన్‌ .. రోలెక్స్‌ వాచ్‌ (రూ.17 లక్షలు), సోదరులు సోహైల్‌, అర్బజ్‌ఖాన్‌లు.. బీఎండబ్ల్యూ కారు (రూ.25 లక్షలు), ఆడీ కారు( రూ.3కోట్లు) ఇచ్చారట. మరోవైపు సల్మాన్‌ తండ్రి సలీమ్‌ ఖాన్‌ జుహులో రూ.12 కోట్లు విలువ చేసే అపార్ట్‌మెంట్‌ని పుట్టినరోజు బహుమతిగా అందచేశారట.

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని