folk songs: జానపదంతో అలరించారు.. జనం నోళ్లలో నిలిచారు..
జానపదాలు ఈ ఏడాది జనం నాడి పట్టాయి... ప్రైవేటు పాటలు వీక్షకుల నాలుకలపై నాట్యమాడాయి...
జానపదాలు ఈ ఏడాది జనం నాడి పట్టాయి... ప్రైవేటు పాటలు వీక్షకుల నాలుకలపై నాట్యమాడాయి... అదేసమయంలో కోట్ల వ్యూస్‌తో మేకర్స్‌కి సిరులు కురిపించాయి... అలా ఈ సంవత్సరం అలరించిన టాప్ సాంగ్స్ ఇవి.
బుల్లెట్టు బండి
ఈ ఏడాదిలో బుల్లెట్టు బండి పాట వినిపించని తెలుగు గడప లేదంటే అతిశయోక్తి కాదు. కుర్రకారు సెల్ఫోన్లో, తెలుగింటి పెళ్లి మండపాల్లో, ప్రైవేటు పార్టీల్లో.. ప్రతి చోటా సందడి చేసింది. ప్రతి ఆడపిల్లా ఈ జానపదాన్ని సొంతం చేసుకుంది. అచ్చ తెలుగు పల్లె పడికట్టు పదాలతో షాద్‌నగర్ కుర్రాడు లక్ష్మణ్ రాసిన ఈ పాటని మోహన భోగరాజు ఆలపించింది. యూట్యూబ్‌లో ఇప్పటివరకు 18 కోట్ల వ్యూస్ వచ్చాయి. షేక్ బాజీ హృద్యమైన బాణీలు సమకూర్చాడు.
బావల్ల నా బావల్ల
బావల్లా నా బావల్లా.. ఎంతా సక్కని బావల్లా.. అంటూ అల్లరి పిల్ల శిరీష చేసిన మాయకి తెలుగు జనం బాగానే ఫిదా అయ్యారు. ఇప్పటికీ ఇంటింటిలో ఇది మార్మోగుతూనే ఉంది. యూట్యూబ్‌లో అయితే రెండున్నర కోట్ల మంది చూశారు. శిరీష ఈ సాంగ్‌లో పాడటమే కాదు.. ఆడింది కూడా. పాట రాసింది, సంగీతం, దర్శకత్వం.. అన్నీ తిరుపతి మాట్లనే. తిరుపతి గతంలోనూ రాసిన ఫోక్సాంగ్స్ ఎన్నో ప్రజల అభిమానాన్ని చూరగొన్నాయి.
గున్న గున్న మావిళ్లల్ల..
అచ్చతెలుగు జనపదానికి ఊపైన స్టెప్పులద్ది పాటని వీడియోగా తీస్తే ఏమవుతుంది? రెండు కోట్ల వ్యూస్ వస్తాయి! గున్నా గున్నా మావిళ్లల్ల అదే జరిగింది. చంద్రప్రకాశ్ రాసిన లిరిక్స్‌కి సింగర్ తేజస్విని హుషారైన గొంతు తోడవడంతో జనం ఈ పాటని తమ ఫేవరిట్ లిస్ట్‌లో చేర్చుకున్నారు. గజ్వేల్ వేణు ఊపైన బాణీలు అందించాడు. వీరందరితో పోటీ పడుతూ పాటలో నటించిన మౌనిక, సందీప్‌లు డ్యాన్స్ స్టెప్పులు, ఎక్స్‌ప్రెషన్స్‌తో అదరగొట్టారు.
వెళ్లురా ఓ మనిషి వెళ్లురా..
నువ్వు కట్టుకున్న బంగుళా దాసుకున్న పైసలు.. ఏవి రావురో.. నీ వెంట రావురో.. జీవిత సారాన్నంతా ఒక్కపాటలో రంగరించి చెప్పినట్టుగా ఉంది కదూ! అందుకే ఈ సాంగ్ జనాలకి బాగా నచ్చేసింది. రాసింది, పాడింది.. బాలు కె.అసుర. పల్లె వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ కళ్లకింపుగా చిత్రీకరించింది అరవింద్ కొణతం. చిన్నచిన్న వాడుక పదాలతో అల్లిన ఈ సాంగ్ పల్లె, పట్టణం తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంది. యూట్యూబ్‌లో కోటి మందికి పైగా వీక్షించారు.
ఉంగురమే
ఊరెనక దున్నిచ్చి.. ఉల్లి నాటేసి ఉంగూరమే రంగైన రాంలాల టుంగూరమే.. అంటూ మామిడి మౌనిక హుషారుగా పాడితే జనం పాదాలు కదలకుండా ఉంటాయా? విడుదలైన మూడు నెలల్లోనే రెండున్నర కోట్ల వ్యూస్ మూటగట్టుకుంది ఈ పాట. నాగదుర్గ అందం, అభినయం, నృత్యం ఈ జానపదానికి ప్లస్‌గా మారింది. తెరకెక్కించింది ఎస్వీ మల్లిక్‌తేజ. ప్రస్తుతానికి టాప్ లిస్టుతోపాటు ట్రెండింగ్‌లో ఉంది ఈ జానపదం.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామ్ చరణ్ బర్త్‌డే.. ఆయన బాల్యం గురించి ఈ విశేషాలు తెలుసా..?
టాలీవుడ్ ప్రముఖ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు.. -
Challenging Roles: పాత్రలకు ప్రాణం పోశారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇలా.. విక్రమ్ అలా!
పాత్రలకు ప్రాణం పోసేందుకు మానసికంగా, శారీరకంగా ఎంతగానో శ్రమించిన నటులు, వారి సినిమాల వివరాలివీ.. -
Tollywood Actresses: అగ్ర నాయికలు అలా రూటు మార్చి.. హాట్‌టాపిక్‌గా నిలిచి!
అగ్ర కథానాయిక- వర్ధమాన హీరో కాంబినేషన్లో వచ్చిన సినిమాల విశేషాలు.. -
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
స్వీయ దర్శకత్వంలో నటించిన హీరో/హీరోయిన్‌పై ప్రత్యేక కథనం. ఎవరు ఏ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారంటే? -
Alia Bhatt: అందుకు క్లాస్‌లో బెంచీలు తుడిచి.. బ్యాగ్రౌండ్ ఉన్నా ఆడిషన్ ఇచ్చి: అలియా భట్ బర్త్‌డే స్పెషల్
అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు విశేషాలు.. -
Mamitha Baiju: గిరిజ, సాయి పల్లవిలా మమితా బైజు.. రాజమౌళి మెచ్చిన ఈ నటి ఎవరు?
యంగ్ హీరోయిన్ మమితా బైజును అగ్ర దర్శకుడు ప్రశంసించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఎవరీ నటి? -
Comedians as Heros: కమెడియన్లు.. కథానాయకులై.. ఎవరెవరు ఏ సినిమాతో అలరించారంటే?
కమెడియన్లుగా కెరీర్‌ని ప్రారంభించి హీరోగాను సినిమాలు చేస్తున్న నటులపై ప్రత్యేక కథనం.. -
Krystyna Pyszkova: మనిషే కాదు.. మనసూ అందమే: మిస్ వరల్డ్ క్రిస్టినా గురించి ఆసక్తికర విశేషాలివీ
ప్రపంచ సుందరి-2024 కిరీటం దక్కించుకున్న క్రిస్టినా పిస్కోవా గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
Miss World Pageant: తొలుత ‘బికినీ కాంటెస్ట్’గా.. 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం.. ‘మిస్ వరల్డ్’ పోటీల సంగతులివీ!
భారత్ ఆతిథ్యంలో 71వ ఎడిషన్ ‘మిస్ వరల్డ్’ పోటీలు జరుగుతున్నాయి. శనివారం విజేతను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఈ అందాల పోటీల గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Sini Shetty: మిస్ వరల్డ్ పోటీలు.. ‘బెస్ట్ డిజైనర్ డ్రెస్’ విజేతగా సినిశెట్టి
మిస్ వరల్డ్ 2024 పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Movies in March: మార్చిలో మురిపించే చిత్రాలు.. వరుణ్ తేజ్ అలా.. ‘టిల్లు’ ఇలా!
మార్చిలో విడుదల కానున్న సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ హీరో చిత్రం ఏ రోజు ప్రేక్షకుల ముందుకు రానుందంటే? -
Valentine Day: వాలంటైన్స్ డేకు రీరిలీజ్ కానున్న ప్రేమకథా చిత్రాలివే..
వాలంటైన్స్ డే సందర్భంగా గతంలో అలరించిన ప్రేమ కథాచిత్రాలు మరోసారి వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. -
తొలి సినిమా ఫ్లాప్.. ‘బండమొహం వీడేం హీరో’ అన్నారు.. రీల్ కెరీర్ To పొలిటికల్ ఎంట్రీ.. విజయ్ లైఫ్ జర్నీ ఇదే!
Actor vijay: తల్లిదండ్రులకు సినీ నేపథ్యం ఉన్నా, నటుడిగా తనకంటూ తమిళనాట గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ ఆయన లైఫ్ జర్నీ ఎలా సాగింది? -
Jeethu Joseph: 17 సినిమాలు.. మూడే ఫ్లాప్‌లు.. చైనీస్, ఇండోనేషియా, కొరియాలోనూ రీమేక్ అయిన మొదటి భారతీయ సినిమా ఆయనదే!
Jeethu Joseph: మోహన్‌లాల్ కథానాయకుడిగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ‘నెరు’ ఓటీటీలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో జీతూ గురించి ఆసక్తికర విషయాలు.. -
Chiranjeevi: ఆ అవమానమే.. సుప్రీం హీరోను మెగాస్టార్ చేసింది: పద్మ విభూషణ్ చిరంజీవి ప్రయాణమిది!
ప్రముఖ నటుడు చిరంజీవికి అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘పద్మ విభూషణ్’ అవార్డు వరించింది. ఈ సందర్భంగా ఆయన గురించి ప్రత్యేక కథనం.. -
Salaar Part 2: ఈ ప్రశ్నలకు సమాధానం... ‘సలార్-2: శౌర్యాంగ పర్వం’ చెబుతుంది!
‘సలార్’ పార్ట్-1 చూసిన వారందరూ ఇప్పుడు పార్ట్-2 ‘శౌర్యాంగ పర్వం’ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ భాగంలో ఏయే ప్రశ్నలకు సమాధానం లభించనుంది? -
Telugu Movies: రిపబ్లిక్ డే ‘డబ్బింగ్’ చిత్రాలదే.. ఆ రోజు ‘ఈగల్’ సింగిల్‌గా..?
రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలకానున్న చిత్రాలు, ఫిబ్రవరి రెండో వారంలో రాబోతున్న సినిమాలపై ప్రత్యేక కథనం.. -
Hombale Films: ఆ పరాజయం.. ‘కేజీయఫ్’, ‘సలార్’ హిట్లకు కారణమైంది: హోంబలే ప్రయాణమిదీ
ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’కు ఆ పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ఆ బ్యానర్‌పై వచ్చిన సినిమాల వివరాలివీ.. -
Pallavi prashanth: ‘బిగ్‌బాస్’కు వెళ్తానంటే ఎగతాళి చేశారు.. ‘విన్నర్’గా నిలిచిన ‘రైతుబిడ్డ’ జర్నీ ఇదీ!
bigg boss 7 telugu winner pallavi prashanth: ఫోక్ సాంగ్స్ క్రియేటర్‌గా జీవితాన్ని మొదలు పెట్టిన పల్లవి ప్రశాంత్ లైఫ్ జర్నీ సాగిందిలా..! -
Bollywood Roundup: రీమేక్స్‌తో డీలా.. షారుక్ సినిమాలతో కొత్త కళ: బాలీవుడ్ తీరిలా!
ఈ ఏడాది విడుదలైన బాలీవుడ్ సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ చిత్రం హిట్? ఏది ఫట్? చూసేయండి.. -
Venkatesh: అద్దమే ఫిల్మ్‌స్కూల్.. హోస్ట్‌గా ఆ షోస్‌కు ‘నో’: వెంకటేశ్ గురించి ఈ విశేషాలు తెలుసా?
ప్రముఖ హీరో వెంకటేశ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన సినిమాల గురించి పలు ఆసక్తికర సంగతులు చూద్దాం..
తాజా వార్తలు (Latest News)
-
న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
-
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
-
భారత సంతతి డాక్టర్‌కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
-
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
-
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
-
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్‌రాజు