Published : 02 Jan 2022 10:44 IST

Kajal: తల్లికాబోతున్న నటి కాజల్‌ అగర్వాల్‌.. ఎమోజీతో చెప్పినగౌతమ్‌

హైదరాబాద్‌: అగ్రకథానాయిక కాజల్ అగర్వాల్‌ భర్త గౌతమ్‌ కిచ్లూ నూతన సంవత్సరం సందర్భంగా గుడ్‌ న్యూస్‌ చెప్పారు. కాజల్‌ తల్లికాబోతున్నారంటూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. న్యూ ఇయర్‌ వేడుకల కోసం ఈ జంట గోవాకు వెళ్లింది. ఇందుకు సంబంధించిన ఓఫొటోని ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసిన గౌతమ్‌.. ‘‘2022.. నిన్నే చూస్తున్నా’’ అంటూ ప్రెగ్నెంట్‌ లేడీ ఎమోజీని ఎటాచ్‌ చేశారు. దీనిని చూసిన అభిమానులు కాజల్‌ - గౌతమ్‌ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.

టాలీవుడ్‌కు చెందిన అగ్ర, యువ హీరోల సరసన నటించి కాజల్‌ స్టార్‌హీరోయిన్‌గా రాణించారు. ఈ క్రమంలోనే తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్‌తో ఆమె ప్రేమలో పడ్డారు. కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న ఈ జంట.. పెద్దల అంగీకారంతో గతేడాది వివాహబంధంలోకి అడుగుపెట్టింది. వివాహం తర్వాత కూడా ఆమె నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘ఆచార్య’, ‘భారతీయుడు-2’ చిత్రాలున్నాయి. అయితే, ప్రెగ్నెంట్‌ కావడంతో ‘భారతీయుడు-2’ నుంచి ఆమె తప్పుకొన్నారని సమాచారం.

Read latest Cinema News and Telugu News

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని