Michael: విలన్‌గా మారిన స్టార్‌ డైరెక్టర్‌

టాలీవుడ్‌ నటుడు సందీప్‌కిషన్‌, కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో ‘మైఖేల్‌’ అనే పాన్‌ ఇండియా చిత్రం సిద్ధం కానున్న విషయం తెలిసిందే.....

Published : 22 Nov 2021 14:12 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ నటుడు సందీప్‌కిషన్‌, కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో ‘మైఖేల్‌’ అనే పాన్‌ ఇండియా చిత్రం సిద్ధం కానున్న విషయం తెలిసిందే. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ మల్టీ స్టారర్‌కు రంజిత్‌ జయకొండి దర్శకత్వం వహించనున్నారు. త్వరలో పట్టాలెక్కనున్న ఈ సినిమాకి సంబంధించిన ఓ సరికొత్త అప్‌డేట్‌ ఇప్పుడు అందర్నీ ఎంతగానో ఆకర్షిస్తోంది. సున్నితమైన ప్రేమకథా చిత్రాలతో యువతకు చేరువైన ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ విషయాన్ని చిత్రనిర్మాణ సంస్థ నేడు అధికారికంగా ప్రకటించింది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ లిమిటెడ్‌, కరణ్‌ సి.ప్రొడెక్షన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌ కావడంతో హీరోలిద్దరూ ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఇటీవల విడుదలైన ‘కనులు కనులను దోచాయంటే’ చిత్రంతో గౌతమ్‌ మేనన్‌ ఇప్పటికే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ సినిమాలో ఆయన పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో మెప్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని