Ghani: గని.. ఇది కని విని ఎరగని..!

కెరీర్‌ ఆరంభం నుంచి విభిన్న కథా చిత్రాలను ఎంచుకుని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన పేరు సొంతం చేసుకున్నారు హీరో వరుణ్‌ తేజ్‌. ‘గద్దలకొండ గణేశ్‌’ వంటి ఫుల్‌ మాస్‌....

Updated : 07 Dec 2022 17:23 IST

హైదరాబాద్‌: కెరీర్‌ ఆరంభం నుంచి విభిన్న కథా చిత్రాలను ఎంచుకుని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన పేరు సొంతం చేసుకున్నారు హీరో వరుణ్‌ తేజ్‌. ‘గద్దలకొండ గణేశ్‌’ వంటి ఫుల్‌ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం ‘గని’. స్పోర్ట్స్‌ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులో వరుణ్‌ తేజ్‌ బాక్సర్‌గా కనిపించనున్నారు. బుధవారం ఉదయం ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘గని ఆంథమ్‌’ పేరుతో విడుదలైన ఈ పాట ప్రతిఒక్కరిలో స్పూర్తి నింపేలా ఉంది. బాక్సర్‌గా వరుణ్‌తేజ్‌ ప్రయాణాన్ని ఈ పాటలో చిత్రీకరించారు.

కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం వరుణ్‌ తేజ్‌ ఫిట్‌నెస్‌ విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించారు. బాక్సింగ్‌లో శిక్షణ పొందారు. బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌..  శిక్షకుడి పాత్రలో కనిపించనున్నారు. ఉపేంద్ర ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. వరుణ్‌కు జోడీగా సాయీ మంజ్రేకర్‌ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘అల్లు బాబీ కంపెనీ’ పతాకంపై అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం డిసెంబర్‌ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని