Valimai: అజిత్‌కి విలన్‌గా కార్తికేయ... ‘వాలిమై’ సందడి షురూ!

ఎప్పుడెప్పుడా అని అటు అజిత్‌ అభిమానులు, ఇటు కార్తికేయ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ‘వాలిమై’ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది.

Published : 23 Sep 2021 23:16 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఎప్పుడెప్పుడా అని అటు అజిత్‌ అభిమానులు, ఇటు కార్తికేయ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వాలిమై’ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ‘గ్లింప్స్‌ ఆఫ్‌ వాలిమై’ పేరుతో చిత్ర బృందం విడుదల చేసిన వీడియో సందడి చేస్తోంది. నాయకా, ప్రతినాయకులుగా అజిత్‌, కార్తికేయ నటిస్తున్నారనే విషయం తెలిసినప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల్ని అందుకునేలా ఈ గ్లింప్స్‌ని  తీర్చిదిద్దిన విధానం బాగుంది. ‘అర్జున్‌.. నువ్వు నా ఇగోని హర్ట్ చేశావ్‌. ఆట మొదలెడదాం సిద్ధంగా ఉండు’ అంటూ కార్తికేయ విలనిజాన్ని చూపించాడు. ఎత్తుకి పైఎత్తు వేస్తూ ‘ఆ ఆటని నేనెప్పుడో ప్రారంభించా’ అని అజిత్‌ చెప్పిన డైలాగ్‌ అలరిస్తోంది. అజిత్‌ డ్రైవ్‌ చేసిన బైకులు, యాక్షన్‌ స్టంట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రానికి హెచ్‌. వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బేవ్యూ ప్రాజెక్ట్స్‌ పతాకంపై బోనీకపూర్‌ నిర్మిస్తున్నారు. యువన్‌ శంకర్‌రాజా స్వరాలు సమకూరుస్తున్నారు. అజిత్‌కు జోడీగా హ్యుమా ఖురేషి నటిస్తోంది. ఈ చిత్రం 2022 సంక్రాంతి కానుకగా విడుదలకానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని