Published : 08 Nov 2021 19:03 IST

Pakka Commercial: ‘విలనిజం నేనెప్పుడో చూశా’.. ‘పక్కా కమర్షియల్‌’ టీజర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఎవరికి చూపిస్తున్నారు సర్‌ మీ విలనిజం? మీరిప్పుడు చేస్తున్నారు. నేనెప్పుడో చేసి, చూసి వచ్చేశా’ అంటూ సందడి చేశారు నటుడు గోపీచంద్‌. ఈయన హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘పక్కా కమర్షియల్‌’. రాశీఖన్నా కథానాయిక. తాజాగా టీజర్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. గోపీచంద్‌ చెప్పిన సంభాషలు ఆకట్టుకునేలా ఉన్నాయి. టైటిల్‌కి తగ్గట్టు సినిమాలో కమర్షియల్‌ హంగులు పక్కాగా ఉన్నాయని టీజర్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. ‘ఇక్కడ ఈ ఎక్స్‌ప్రెషన్‌ పెట్టకూడదు.. ఇలా పెట్టాలి’ అంటూ రాశీఖన్నా చేసే హడావుడి సరదాగా ఉంది. కోర్టు నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో గోపీచంద్‌, రాశీఖన్నా లాయర్లుగా కనిపించనున్నారు. మరి లాయరైన గోపీచంద్‌ విలనిజం గురించి చెప్తూ ఎవరికి వార్నింగ్‌ ఇచ్చారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. యువీ క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ 2 పిక్చర్స్‌ సంస్థలు నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. జాక్స్‌ బెజోయ్‌ సంగీతం అందిస్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.
 

Read latest Cinema News and Telugu News


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని