Seetimaarr: గోపీచంద్‌ ‘సీటీమార్‌’ ట్రైలర్‌ వచ్చేసింది 

గోపీచంద్‌ హీరోగా  నటించిన ‘సీటీమార్‌’ ట్రైలర్‌ని నటుడు రామ్‌ పోతినేని విడుదల చేశారు.

Updated : 31 Aug 2021 15:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గోపీచంద్‌ కథానాయకుడిగా సంపత్‌ నంది దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సీటీమార్’. తమన్నా కథానాయిక. ఈ సినిమా వినాయకచవితి కానుకగా సెప్టెంబరు 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో యువనటుడు రామ్‌ పోతినేని ట్రైలర్‌ని విడుదల చేశారు. కబడ్డీ నేపథ్యంలో సాగే కథ ఇది. ‘ఒక ఊరి నుంచి ఎనిమిది మంది ప్లేయర్సా? మీకు రూల్స్‌ తెలుసు కదా’ అనే సంభాషణతో ప్రారంభమవుతుందీ ట్రైలర్‌. ‘రూల్స్‌ ప్రకారం పంపిస్తే ఆడి వస్తారు సర్‌. రూట్ లెవల్‌ నుంచి ఆలోచించి పంపిస్తే పేపర్‌లో వస్తారు’ అని గోపీచంద్‌ ఇచ్చిన సమాధానం అలరిస్తుంది.  పవర్‌ ఫుల్‌ డైలాగ్స్‌తో, యాక్షన్‌ సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ‘ఒక్కసారి కోర్టులో అడుగుపెట్టాక మీ ఫోకస్‌ ఉండాల్సింది కూత, గీత మీదే.. ఈ బ్యాచ్‌ అయిపోయేలోపు మ్యాచ్‌ అయిపోవాలి ’ అంటూ కోచ్‌గా గోపీచంద్‌ విశేషంగా ఆకట్టుకుంటున్నారు. గోపీచంద్‌, తమన్నా, రావు రమేశ్‌ నటన మెప్పిస్తోంది.  నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది.

ఈ సినిమాలో గోపీచంద్‌, తమన్నా ఆంధ్రా, తెలంగాణ కబడ్డీ జట్ల కోచ్‌లుగా కనిపించనున్నారు. దిగంగనా సూర్యవంశీ, భూమిక కీలక పాత్రలు పోషించారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ‘గౌతమ్‌నంద’ తర్వాత సంపత్‌నంది- గోపీచంద్‌ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాకావడంతో ‘సీటీమార్‌’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని