Pushpa: ‘పుష్ప’ జోరు

క్రేజ్‌లోనే కాదు... విడుదలకి ముందస్తు వ్యాపారంలోనూ తగ్గేదే లే అంటున్నాడు ‘పుష్ప’. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం రూ.250 కోట్లు వ్యాపారం చేసినట్టు పరిశ్రమ వర్గాల లెక్క. అల్లు అర్జున్‌ చేసిన తొలి పాన్‌

Updated : 12 Dec 2021 08:23 IST

క్రేజ్‌లోనే కాదు... విడుదలకి ముందస్తు వ్యాపారంలోనూ తగ్గేదే లే అంటున్నాడు ‘పుష్ప’. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం రూ.250 కోట్లు వ్యాపారం చేసినట్టు పరిశ్రమ వర్గాల లెక్క. అల్లు అర్జున్‌ చేసిన తొలి పాన్‌ ఇండియా చిత్రమిది. ఐదు భాషల్లో ప్రదర్శన హక్కులు, డిజిటల్‌ హక్కులతో ఈ చిత్రం వ్యాపారంలో దూసుకెళ్లింది. విజయవంతమైన అల్లు అర్జున్‌ - సుకుమార్‌ కలయికల కావడం, ‘అల.. వైకుంఠపురములో’ తర్వాత అల్లు అర్జున్‌ చేసిన చిత్రం కావడంతో సినిమాపై వ్యాపార వర్గాల్లో మంచి క్రేజ్‌ ఏర్పడింది. అల్లు అర్జున్‌కి తెలుగుతోపాటు, మలయాళంలోనూ మంచి మార్కెట్‌ ఉండటం సినిమాకి కలిసొచ్చింది. హిందీ, తమిళంలో అల్లు అర్జున్‌ సినిమా విడుదల కావడం ఇదే తొలిసారి. కరోనాతో సినీ వ్యాపారం మొత్తం ఒడుదొడుకులకి లోనైంది. అదే   సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో టికెట్‌ ధరల ప్రభావమూ సినిమాల వ్యాపారంపై బలంగానే ఉంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ‘పుష్ప’కి రికార్డు స్థాయిలో ముందస్తు వ్యాపారం జరగడం చిత్రబృందానికి ఉత్సాహాన్నిచ్చింది. ‘పుష్ప’ రెండు భాగాలుగా రానున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌, రష్మిక మందన్న జోడీ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకొస్తుండగా, మలిభాగం ఫిబ్రవరిలో మొదలవుతుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌... ముత్తంశెట్టి మీడియాతో కలిసి నిర్మిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని