
Published : 01 Jan 2022 16:38 IST
Naga Chaitanya: మరో కథ సిద్ధమైందా?
ఈ ఏడాది ‘లవ్‌స్టోరి’తో విజయాన్ని అందుకున్న నాగచైతన్య ప్రస్తుతం ‘బంగార్రాజు’, ‘థ్యాంక్‌యూ’ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. వచ్చే ఏడాది ఈ రెండు చిత్రాలూ వరుసగా ప్రేక్షకుల ముందుకొస్తాయి. మరో పక్క చైతూ కోసం కొత్త కథలు సిద్ధం అవుతున్నాయి. పలువురు యువ దర్శకులు ఆయన కోసం కథల్ని సిద్ధం చేసి వినిపించారు. దర్శకురాలు నందినిరెడ్డి కూడా నాగచైతన్య కోసం ఓ కథని సిద్ధం చేసి వినిపించినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమాపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.
Tags :