Missing: మిస్సింగ్‌ నాకో మలుపు

నటుడు నర్రా శ్రీను మా బాబాయ్‌. ఆయన నువ్వు సొంతంగా ఎదగాలంటే నీ ప్రయత్నాలు నువ్వు చేయాలని చెప్పారు. అందుకే నేను స్వతహాగా నాకంటూ పేరు వచ్చేలా ప్రయత్నాలు చేశాను. ప్రత్యేకంగా ఒక రకమైన జోనర్‌ కథలు చేయాలనే

Updated : 07 Dec 2022 17:39 IST

నటుడు నర్రా శ్రీను మా బాబాయ్‌. ఆయన నువ్వు సొంతంగా ఎదగాలంటే నీ ప్రయత్నాలు నువ్వు చేయాలని చెప్పారు. అందుకే నేను స్వతహాగా నాకంటూ పేరు వచ్చేలా ప్రయత్నాలు చేశాను. ప్రత్యేకంగా ఒక రకమైన జోనర్‌ కథలు చేయాలనే నియమాలేమీ పెట్టుకోలేదు. కొత్తగా కొన్ని కథలు వింటున్నా. ‘మిస్సింగ్‌’ నా కెరీర్‌కి మలుపునిస్తుంది’’.

వెబ్‌ సిరీస్‌ల్లో అవకాశాలు వస్తున్నా... సినిమాకే తొలి ప్రాధాన్యం ఇస్తూ ప్రయాణం చేస్తున్నానని తెలిపారు హర్ష నర్రా. ‘మిస్సింగ్‌’ చిత్రంతో  పరిచయమవుతున్న కథానాయకుడీయన. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదివరకు ‘ముద్దపప్పు ఆవకాయ్‌’, ‘పెళ్లిగోల’ వెబ్‌సిరీస్‌ల్లో నటించారు. తొలి సినిమా చాలా ముఖ్యమైనది, అందుకే ఓ అరుదైన ప్రయత్నం చేయాలనే ‘మిస్సింగ్‌’ కథని ఎంపిక చేసుకున్నానని చెబుతున్న హర్ష నర్రా బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు. ‘‘నటుడు కావాలనేది నా కల. ‘ఆకాశమంత ప్రేమ’ అనే లఘు చిత్రం చేశా. ఆ తర్వాత వెబ్‌ సిరీస్‌ల్లో అవకాశాలు వచ్చాయి. ‘పెళ్లిగోల’తో మంచి పేరు రావడంతో సినిమా ప్రయత్నాలు ప్రారంభించా. శ్రీని జోస్యుల పరిచయం తర్వాత, ఆయన రాసుకున్న కథకి నేను సరిపడేలా ఉంటానని నన్ను ఎంపిక చేసుకున్నారు. పెళ్లయ్యాక గౌతమ్‌ భార్య శ్రుతి కనిపించకుండా పోతుంది. ఆమె ఏమైందనే అంశం నుంచే ఈ కథ మొదలవుతుంది. తప్పకుండా సినిమా విజయవంతం కావడంతోపాటు నటుడిగా నాకు మంచి పేరొస్తుంది. ఇది నా తొలి సినిమా కావడం నా అదృష్టం’’. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని