Sai Dharam Tej: సాయి ధరమ్‌ తేజ్‌ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల

రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు సాయి ధరమ్‌ తేజ్‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు

Updated : 11 Sep 2021 10:41 IST

హైదరాబాద్‌ : రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు సాయి ధరమ్‌ తేజ్‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తాజా హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ‘సాయి తేజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రధాన అవయవాలు బాగానే పనిచేస్తున్నాయి. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నాం. ఈ రోజు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తాం’ అని అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై రేపు మరో బులెటిన్‌ విడుదల చేస్తామని తెలిపారు.

సాయి తేజ్‌ ఒక ఫైటర్‌.. త్వరగా కోలుకుంటారు : ప్రకాశ్‌ రాజ్‌

మరోవైపు సాయి తేజ్‌ని పలువురు సినీ నటులు పరామర్శిస్తున్నారు. ప్రకాశ్‌ రాజ్, శ్రీకాంత్ తదితరులు సాయితేజ్‌ను ఈ ఉదయం పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ‘వైద్యులతో మాట్లాడాం. సాయి తేజ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మన అందరికి తెలుసు సాయి ఒక ఫైటర్. అతను త్వరగా కొలుకుంటారు’ అని ప్రకాశ్‌ రాజ్‌ ఆకాంక్షించారు. సాయి తేజ్‌ త్వరగా కోలుకోవాలని మనందరం కోరుకుందామని శ్రీకాంత్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని