Jr NTR: రామ్‌ చరణ్‌తో ఎన్టీఆర్‌ నవ్వులు.. సమంతతో గొడవ!

వెండితెరైనా, బుల్లితెరైనా తన వాక్పటిమతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంటారు జూనియర్‌ ఎన్టీఆర్‌. ప్రస్తుతం.. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం వేదికగా విజ్ఞానంతోపాటు మంచి వినోదం పంచుతున్నారు.

Updated : 14 Sep 2023 17:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వెండితెరైనా, బుల్లితెరైనా తన వాక్పటిమతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంటారు ఎన్టీఆర్‌. ప్రస్తుతం.. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం వేదికగా విజ్ఞానంతోపాటు మంచి వినోదం పంచుతున్నారు. సెలబ్రిటీలను ఈ షోకి ఆహ్వానించి మరింత సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో తొలి అతిథిగా రామ్‌ చరణ్‌ విచ్చేసి హంగామా చేశారు. తర్వాత నటి సమంత, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్‌, తమన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో ఎన్టీఆర్‌ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఈ గెస్ట్‌లతో ఎన్టీఆర్‌ మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా చేసింది. అందుకే ‘హార్ట్‌ వామింగ్‌ మూమెంట్స్‌ ఆఫ్‌ ఈఎమ్‌కే’ పేరుతో ఓ వీడియోను రూపొందించారు. ఇందులో రామ్‌ చరణ్‌, సమంత, రాజమౌళి, కొరటాల శివతో సాగిన సంభాషణలు కనిపించాయి. ఇంకెందుకు ఆలస్యం సమంతతో ఎన్టీఆర్‌ నవ్వుతూ చేసిన మాటల యుద్ధం, రామ్‌ చరణ్‌, రాజమౌళి, కొరటాల శివతో చేసిన నవ్వుల ప్రయాణాన్ని మరోసారి ఆస్వాదించండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని