Hebah Patel: ‘గీత’ పోరాటం

హెబ్బా పటేల్‌ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘గీత’. మ్యూట్‌ విట్నెస్‌... అనేది ఉపశీర్షిక. వి.వి.వినాయక్‌ దగ్గర శిష్యరికం చేసిన విశ్వ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆర్‌.రాచయ్య నిర్మాత.

Updated : 17 Dec 2021 11:00 IST

హెబ్బా పటేల్‌ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘గీత’. మ్యూట్‌ విట్నెస్‌... అనేది ఉపశీర్షిక. వి.వి.వినాయక్‌ దగ్గర శిష్యరికం చేసిన విశ్వ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆర్‌.రాచయ్య నిర్మాత. ప్రముఖ నటుడు సునీల్‌ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. ‘నువ్వేకావాలి’, ‘ప్రేమించు’ సినిమాల హీరో సాయికిరణ్‌ ప్రతినాయకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరపుకొంటున్న ఈ సినిమా తొలి ప్రచార చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘అడుగడుగునా ఉత్కంఠ రేకెత్తించే అంశాలతో రూపొందించిన చిత్రమిద’’న్నారు.  రామ్‌కార్తీక్‌, సప్తగిరి, రాజీవ్‌ కనకాల, పృథ్వీ, తనికెళ్ల భరణి, సంధ్యా జనక్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: సుభాష్‌ ఆనంద్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని