Katrina Kaif: వెండి తెరపై.. పెళ్లి దుస్తుల్లో మెరిసిన ‘మల్లీశ్వరి’! 

బాలీవుడ్‌ ప్రేమ పక్షులు కత్రినా కైఫ్‌, విక్కీ కౌశల్‌ ఒక్కటికాబోతున్నారు. డిసెంబరు 9న ఈ ఇద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు.

Updated : 08 Dec 2021 12:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ ప్రేమ పక్షులు కత్రినా కైఫ్‌, విక్కీ కౌశల్‌ వివాహ బంధంతో ఒక్కటికాబోతున్నారు. డిసెంబరు 9న మూడుముళ్ల బంధంతో సంసార సాగరంలోకి అడుగుపెట్టబోతున్నారు. పెళ్లి దుస్తుల్లో ఈ జోడీని చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఎలాంటి డ్రెస్సుల్లో మెరుస్తారోనని ఆరా తీస్తున్నారు. అప్పటి వరకూ వేచి చూడలేని కొందరు అభిమానులైతే.. ఏకంగా కత్రినా వెండితెరపై వధువుగా మెరిసిన చిత్రాల్ని గుర్తుచేసుకుంటున్నారు. ‘హమ్‌ దీవానా కర్ గయే’, ‘సింగ్‌ ఈజ్‌ కింగ్‌’, ‘బార్‌ బార్‌ దేఖో’ తదితర చిత్రాల్లో కత్రినా పెళ్లి దుస్తుల్లో కనిపించింది. కళ్లు మిరుమిట్లుగొలిపే డ్రెస్సుల్లో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఆ దృశ్యాల్ని మీరూ చూసేయండి!

కత్రినా ‘మల్లీశ్వరి’గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వెంకటేశ్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన ‘అల్లరి పిడుగు’లోనూ సందడి చేసిన విషయం తెలిసిందే. 

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని