Cinema news: నయన్-విఘ్నేష్ అలా.. బన్ని-స్నేహారెడ్డి ఇలా...!
ఒకప్పుడు తమ అభిమాన హీరో ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడో వార్తా పత్రికలు, సినీ మ్యాగజైన్స్‌లో
ఇంటర్నెట్‌డెస్క్: ఒకప్పుడు తమ అభిమాన హీరో ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడో వార్తా పత్రికలు, సినీ మ్యాగజైన్స్‌లో వస్తే కానీ, తెలిసేది కాదు. కానీ ఆధునిక యుగంలో సామాజిక మాధ్యమాల ద్వారా సినీ తారలే అభిమానులకు చేరుగా ఉంటున్నారు. తాము ఎక్కడ ఉన్నది? ఎవరితో ఉన్నది ఇలా ప్రతి విషయాన్ని పంచుకుంటున్నారు. ఇక నిత్యం షూటింగ్‌లతో బిజీగా ఉండే సినీతారలు కూడా తమ కుటుంబ సభ్యులను తీసుకుని విహారయాత్రలకు వెళ్లడం సహజం. మరి మన సినీతారల విహారయాత్రల కబుర్లు ఇవే!
గుళ్లూ గోపురాలు తిరుగుతున్న నయన్-విఘ్నేష్
తరచూ విహారయాత్రలకు వెళ్లే జోడీలో కోలీవుడ్ ప్రేమ జంట నయనతార, విఘ్నేష్ శివన్‌లు ఉంటారు. విఘ్నేష్ ఎప్పటికప్పుడు నయన్‌తో తాను కలిసి ఉన్న ఫొటోలను, సమాచారాన్ని సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకుంటాడు. తాజాగా వీరిద్దరూ మహారాష్ట్రను చుట్టి వచ్చారు. షిర్డీ, ముంబాదేవి, మహాలక్ష్మి ఆలయం, సిద్ధివినాయక ఆలయాలను దర్శించుకున్నట్లు విఘ్నేష్ తెలిపారు.
మాల్దీవులకు వెళ్లొచ్చిన అల్లు అర్జున్-స్నేహారెడ్డి
సినిమాతో పాటు, కుటుంబానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే కథానాయకుల్లో అల్లు అర్జున్ ముందుంటారు. తన కుటుంబ సభ్యుల పుట్టినరోజు వస్తే, ఆ సమయంలో ఏ దేశంలో ఉన్నా వచ్చి వెళ్తానని ఎన్నోసార్లు చెప్పారు. ప్రస్తుతం ‘పుష్ప’ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’లో నటిస్తున్న ఆయన కొన్ని రోజులు కిందట సతీమణి స్నేహారెడ్డి, పిల్లలతో కలిసి విహారయాత్రకు మాల్దీవులు వెళ్లి వచ్చారు. అక్కడ బోటులో దిగిన వీడియోను స్నేహారెడ్డి తాజాగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
సుహాస్ కూడా మాల్దీవుల్లోనే..
నటుడు సుహాస్ కూడా విహారయాత్రలో ఉన్నారు. తన భార్య లలితతో కలిసి మాల్దీవుల్లో ప్రకృతి ఆస్వాదిస్తున్నారు. ఈ సందర్భంగా బీచ్ ఒడ్డున దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.
భర్తతో కలిసి ఆకాంక్షసింగ్..
‘మళ్లీ రావా’, ‘దేవదాస్’, తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి ఆకాంక్షసింగ్. ప్రస్తుతం ఆమె తన భర్త కునాల్ సైన్‌తో కలిసి మాల్దీవుల్లో విహరిస్తోంది. ‘నీతో కలిసి నడవటం స్వర్గం’ అంటూ అక్కడ కునాల్‌తో కలిసి దిగిన ఫొటోలను పంచుకుంది.
* స్టార్ హీరోయిన్‌ప్రియాంక చోప్రా స్కూబా డైవింగ్ చేశారు. స్పెయిన్‌లో ఉన్న ఆమె సముద్రగర్భంలోని అందాలను ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె షేర్ చేశారు.
* బాలీవుడ్ కథానాయిక పరిణీతి చోప్రా నేపాల్‌లో ఉన్నారు. అక్కడ కొండలపై ధ్యానం చేస్తున్న ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Girish Bapat: భాజపా ఎంపీ గిరీశ్ బాపట్ కన్నుమూత.. ప్రధాని మోదీ విచారం
-
General News
TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ ఇంకెవరికైనా ఇచ్చారా?.. ముగ్గురు నిందితులను విచారిస్తున్న సిట్
-
Movies News
Chamkeela Angeelesi: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న ‘చమ్కీల అంగిలేసి’.. ఈ వీడియోలు చూశారా..!
-
World News
Biden Vs Netanyahu: మా నిర్ణయాలు మేం తీసుకుంటాం.. అమెరికాకు స్పష్టం చేసిన ఇజ్రాయెల్
-
General News
Viveka Murder case: వివేకా హత్య కేసు విచారణకు కొత్త సిట్..
-
Sports News
Mumbai Indians: ముంబయికి మాత్రమే ఈ రికార్డులు సాధ్యం.. ఓ లుక్కేస్తారా?