
Karthikeya: వైభవంగా హీరో కార్తికేయ నిశ్చితార్థం
హైదరాబాద్: ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ హీరో కార్తికేయ ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫంక్షన్ హాల్‌లో ఆయన నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు వధూవరుల కుటుంబ సభ్యులతోపాటు అతి తక్కువ మంది సన్నిహితులు హాజరయ్యారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు సైతం కార్తికేయ నిశ్చితార్థానికి హాజరై అభినందనలు తెలిపారు. నిశ్చితార్థానికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు కార్తికేయ మనువాడబోయే అమ్మాయికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సినీరంగంపై ఆసక్తితో కార్తికేయ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 2017లో విడుదలైన ‘ప్రేమతో మీ కార్తీక్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమా అనుకున్నంతగా విజయాన్ని అందించలేకపోయింది. అనంతరం వచ్చిన ‘ఆర్‌ఎక్స్ 100’ ఆయనకు సూపర్‌హిట్ అందించింది. కేవలం హీరో రోల్స్ మాత్రమే కాకుండా ప్రతినాయకుడిగాను ఆయన మెప్పిస్తున్నారు. నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్‌లీడర్’లో కార్తికేయ విలన్‌గా నటించారు. అజిత్ హీరోగా తెరకెక్కుతోన్న ‘వలిమై’లో కీలకపాత్ర పోషిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.