
RajTarun: హైదరాబాద్‌కి ఎలా రావాలో తెలియదు!
మన ఇంట్లోకుర్రాడినీ... మన గ్యాంగ్‌లో ఒకడిని గుర్తు చేస్తూ తెరపై కనిపిస్తుంటాడు రాజ్‌తరుణ్. జయాపజయాలతో సంబంధం లేకుండా సాగిపోతున్న ఈ యువ కథానాయకుడు అల్లరి చేస్తే చూడ్డానికి భలే సరదాగా ఉంటుంది. ‘అనుభవించు రాజా’తో రెట్టింపు సరదాల్ని పంచుతానని చెబుతున్నాడు. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా రాజ్‌తరుణ్ బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
‘‘నేను హుషారైన పాత్రలు చేసి చాలా కాలమైంది. మళ్లీ వాటిని గుర్తు చేస్తూ... ఇంతకుముందు కంటే రెట్టింపు హుషారైన పాత్ర చేసే అవకాశం ఈ సినిమాతో దక్కింది. దర్శకుడు శ్రీను గవిరెడ్డి నాకు మంచి స్నేహితుడు. తను కథ చెప్పినప్పట్నుంచి చాలా ఆత్రుతగా ఎదురు చూశా. స్వతహాగా నాకు వినోదాత్మక కథలన్నా, గోదావరి యాస అన్నా చాలా ఇష్టం. భీమవరం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. నా సగం సినిమాల్ని భీమవరంలోనే చేశా. నాకు జూదం అంటే నచ్చదు. ఇందులో కోడి పందేల నేపథ్యం ఉంటుంది. సంక్రాంతి సమయంలో పందేలు చూశాను కానీ, ఎప్పుడూ పందెం కాయలేదు. సంక్రాంతి నుంచే మొదలయ్యే ఈ కథ కోసం కోడి పందేల వాతావరణాన్ని చూపించాం. నాకు జంతువులంటే చాలా ఇష్టం. దాంతో సెట్లో నాకు ఇచ్చిన కోడి తొందరగా మచ్చికైంది. దానికీ చిత్రీకరణ బాగా అలవాటైపోయింది. షూటింగ్ తర్వాత ఇంటికి తీసుకెళితే అక్కడ ఏం తినకుండా దిగాలుగా కూర్చునేదట. మరుసటి రోజు సెట్లోకి వచ్చేసరికి మళ్లీ హుషారైపోయేది (నవ్వుతూ)’’.
*‘‘సరదా కుర్రాడైన బంగారంగానూ, సెక్యూరిటీ గార్డ్‌గానూ రెండు కోణాల్లో సాగే పాత్రలో కనిపిస్తా. సెక్యూరిటీ గార్డ్ అని మనం తేలిగ్గా అనేస్తాం కానీ... ఆ ఉద్యోగంలోకి రావడం వెనక ఎంతగా కసరత్తులు చేస్తారో ఈ సినిమాతో తెలిసింది. బంగారం పాత్రలోని హుషారు మరోసారి ప్రేక్షకుల్ని అలరిస్తుంది. కామెడీతోపాటు, చక్కటి భావోద్వేగాలు, అంతర్లీనంగా ఓ మంచి సందేశం ఉన్న కథ ఇది. నటుడిగా నా కెరీర్ మొదలైంది అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే. ఆ సంస్థలోనే మూడో సినిమా చేశానంటే అది నా అదృష్టం. దర్శకుడు శ్రీను గవిరెడ్డితో ఇంతకుముందు ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ చేశా. తనలో ఇప్పుడు పరిణతి పెరిగింది. నిజాయతీగా, ఎంతో స్పష్టతతో ఈ సినిమాని తెరకెక్కించాడు’’.
*‘ ‘‘నచ్చిన కథ చేయడమే తప్ప ప్రత్యేకంగా కెరీర్‌ని ఎప్పుడూ ప్లాన్ చేసుకోలేదు. హైదరాబాద్‌కి ఎలా రావాలో తెలియని కుర్రాణ్ని. చిన్నప్పుడు మా తల్లిదండ్రులతో కలిసి వచ్చాను తప్ప నాకు నేనుగా ఎప్పుడూ వచ్చింది లేదు. అలాంటి నేను ఇక్కడికొచ్చి హీరోగా నిలదొక్కుకుని 14వ సినిమా చేశా. ఇంకోటి విడుదలకి సిద్ధంగా ఉంది. మరో మూడు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. ఇంతకంటే గొప్ప అదృష్టం ఏం ఉంటుంది? విజయాలు నిలుపుకోలేకపోయాననే బాధ ఏమీ లేదు. ఒక సినిమా కోసం అందరం కష్టపడి పనిచేస్తాం. ఎక్కడో ఒక చోట తప్పు జరుగుతుంది. మళ్లీ అది జరగకుండా చూసుకుంటూ ముందుకు సాగడమే మా పని.
‘స్టాండప్ రాహుల్’ నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. దాని తర్వాత ‘మాస్ మహారాజ్’ వస్తుంది. అదో రకమైన జానర్. అందులో నా యాస కొత్తగా ఉంటుంది. వెబ్ సిరీస్‌ల్లో నటించడం నాకు ఇష్టమే. ఆమధ్య ఓ మంచి అవకాశం వచ్చింది. చేయాలనుకున్నాను. డేట్స్ కుదరలేదు’’.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Sanjay Raut: మధ్యంతర ఎన్నికలొస్తే.. 100కి పైగా సీట్లు మావే: రౌత్ కీలక వ్యాఖ్యలు
-
India News
Twitter: కేంద్రంపై ట్విటర్ ‘న్యాయ’ పోరాటం..?
-
India News
Asaduddin Owaisi: తాజ్‌మహల్ నిర్మించకపోతే లీటరు పెట్రోల్ రూ.40కే వచ్చేది: ఒవైసీ
-
General News
APPSC: ఏపీలో 2018 గ్రూప్- 1 తుది ఫలితాలు విడుదల
-
Politics News
Ragurama: ఎంపీ రఘురామ కృష్ణరాజుపై హైదరాబాద్‌లో కేసు నమోదు
-
Business News
Service Charge: రెస్టారెంట్లు సర్వీసు ఛార్జ్ వసూలు చేస్తున్నాయా? ఈ నెంబరుకు ఫిర్యాదు చేయండి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- China’s real estate crisis: పుచ్చకాయలకు ఇళ్లు.. సంక్షోభంలో చైనా రియల్ ఎస్టేట్ ..!
- Double BedRooms: అమ్మకానికి.. రెండు పడక గదుల ఇళ్లు!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Anveshi Jain: ‘సీసా’ తో షేక్ చేస్తున్న అన్వేషి జైన్.. హుషారు వెనక విషాదం ఇదీ!
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- IND vs ENG : టెస్టు క్రికెట్ చరిత్రలో టాప్-4 భారీ లక్ష్య ఛేదనలు ఇవే..!
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!