Hero: ‘హీరో’ ఎప్పుడొస్తాడంటే?

మహేష్‌బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ తనయుడు అశోక్‌ గల్లా కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘హీరో’. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. అమర్‌రాజా మీడియా అండ్‌

Updated : 14 Nov 2021 08:21 IST

మహేష్‌బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ తనయుడు అశోక్‌ గల్లా కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘హీరో’. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. అమర్‌రాజా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై గల్లా పద్మావతి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాత ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘భిన్నమైన కథలతో సినిమాలు తీస్తున్న దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య. మరో సరికొత్త కథాంశంతో ‘హీరో’ని తీర్చిదిద్దాడు. అశోక్‌ గల్లా శక్తివంతమైన పాత్రలో కనిపిస్తారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కి విశేష స్పందన లభించింది. చిత్రం తప్పకుండా ప్రేక్షకుల మెప్పు పొందుతుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. జగపతిబాబు, నరేష్‌, సత్య, అర్చన సౌందర్య తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, రిచర్డ్‌ప్రసాద్‌, సంగీతం: జిబ్రాన్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని