Sumanth: హీరో సుమంత్‌ వివాహమా? కొత్త సినిమా ప్రమోషనా?

అక్కినేని కుటుంబంలో శుభకార్యం జరగనుందా? హీరో సుమంత్‌ వివాహం నిశ్చయమైందా? వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న సుమంత్‌

Updated : 29 Jul 2021 20:03 IST

వైరల్‌గా మారిన పెళ్లి కార్డు

హైదరాబాద్‌: అక్కినేని కుటుంబంలో శుభకార్యం జరగనుందా? హీరో సుమంత్‌ వివాహం నిశ్చయమైందా? వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న సుమంత్‌ త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారా? ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే టాపిక్‌ ట్రెండింగ్‌లో ఉంది. ఈ మేరకు సుమంత్‌‌-పవిత్రలకు సంబంధించిన ఓ పెళ్లిపత్రిక నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. కానీ, ఇది నిజం కాకపోవచ్చు. కొత్త సినిమా ప్రమోషన్‌ కూడా కావొచ్చు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాలంటే సుమంత్‌ స్పందించాల్సి ఉంది.

‘ప్రేమకథ’తో వెండితెరకు పరిచయమైన సుమంత్‌ .. ‘స్నేహమంటే ఇదేరా’, ‘సత్యం’, ‘గోదావరి’, ‘గోల్కోండ హైస్కూల్‌’ చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే వరుస పరాజయాల అనంతరం ‘మళ్లీరావా’ సినిమాతో సుమంత్‌ పాజిటివ్‌ టాక్‌ అందుకున్నారు. ఇటీవల ఆయన కథానాయకుడిగా నటించిన ‘కపటధారి’ మిశ్రమ స్పందనలు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా ‘అనగనగా ఒక రౌడీ’లో నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని