Jersey: హిందీ ‘జెర్సీ’.. విడుదల మరోసారి వాయిదా

షాహిద్‌ కపూర్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘జెర్సీ’ సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది.

Published : 28 Dec 2021 16:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: షాహిద్‌ కపూర్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘జెర్సీ’ సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే విడుదలకావాల్సిన ఈ చిత్రం వివిధ కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు డిసెంబరు 31న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది. కానీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమాను మళ్లీ వాయిదా వేసింది. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించే అవకాశాలున్నాయని, ఈ సినిమా ఓటీటీలో విడుదలవుతుందనే వార్తల్లో నిజం లేదని సినీ వర్గాలు తెలిపాయి.

తెలుగులో ఘన విజయం అందుకున్న ‘జెర్సీ’కి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. నాని పాత్రలో షాహిద్‌ కనిపించనున్నారు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. మాతృకను తెరకెక్కించిన గౌతమ్‌ తిన్ననూరినే ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని దిల్‌రాజు, సూర్యదేవర నాగవంశీ, అమన్‌ నిర్మించారు. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. సచిత్‌- పరంపర సంగీతం అందించారు.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని