‘హనీట్రాప్‌’లో చిక్కిందెవరు?

‘సొంతవూరు’, ‘గల్ఫ్‌’..లాంటి  సందేశాత్మక చిత్రాలతో సినీప్రియుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు  సాధించుకున్న దర్శకుడు పి.సునీల్‌ కుమార్‌ రెడ్డి. ఓ సమకాలీన కథతో ఇప్పుడాయన తెరకెక్కించిన కొత్త చిత్రం ‘హనీ ట్రాప్‌’. వివి వామనరావు కీలక పాత్రలో నటిస్తూ..

Updated : 08 Sep 2021 07:26 IST

‘సొంతవూరు’, ‘గల్ఫ్‌’..లాంటి  సందేశాత్మక చిత్రాలతో సినీప్రియుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న దర్శకుడు పి.సునీల్‌ కుమార్‌ రెడ్డి. ఓ సమకాలీన కథతో ఇప్పుడాయన తెరకెక్కించిన కొత్త చిత్రం ‘హనీ ట్రాప్‌’. వివి వామనరావు కీలక పాత్రలో నటిస్తూ.. స్వయంగా నిర్మించారు. రిషి, శిల్ప నాయక్‌, తేజు  అనుపోజు, శివ కార్తీక్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘నేనెప్పుడూ నా సొంత కథలతోనే సినిమాలు చేస్తుంటా. కానీ, ఈసారి మా నిర్మాత వామనరావు చెప్పిన కథ నచ్చి ఈ చిత్రం తెరకెక్కించా. ఇందులో నటీనటులందరూ చక్కగా నటించారు. వాళ్లందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘హీరోగా నా తొలి చిత్రమిది. నిర్మాత ఖర్చుకు వెనకాడకుండా తీశార’’న్నారు హీరో రిషి. నిర్మాత వివి వామనరావు మాట్లాడుతూ ‘‘సునీల్‌ రెడ్డి గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండే చిత్రమిది. ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా థియేటర్లలో చూస్తేనే బాగుంటుందని ఈనెల 17న విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి ప్రవీణ్‌ ఇమ్మడి స్వరాలందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని