Pawan Kalyan: ‘భీమ్లా నాయక్‌’ పాటపై పోలీసు అధికారి అభ్యంతరం!

‘భీమ్లా నాయక్‌’ గీతంపై హైదరాబాద్‌ ఈస్ట్‌జోన్‌ డీసీపీ అభ్యంతరం వ్యక్తం చేశారు.

Published : 03 Sep 2021 15:42 IST

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘భీమ్లా నాయక్‌’. పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ గీతాన్ని చిత్రబృందం గురువారం విడుదల చేసింది. కథానాయకుడి పాత్రని అభివర్ణిస్తూ చాలా పవర్‌ఫుల్‌గా సాగే ఈ పాట శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకుంది. విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. మరోవైపు ఈ పాటపై అభ్యంతరాలూ వ్యక్తం అవుతున్నాయి. పోలీసుల గురించి ఈ పాటలో వివరించిన తీరు బాగాలేదని హైదరాబాద్‌ ఈస్ట్‌జోన్‌ డి.సి.పి. రమేశ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘మేం (తెలంగాణ పోలీసులు) ఫ్రెండ్లీ పోలీసులం. ప్రజలకి రక్షణ కల్పించేందుకు జీతాలు తీసుకునే మేం వారి ఎముకల్ని విరగ్గొట్టం. పోలీసుల గొప్పతనాన్ని చెప్పేందుకు రచయిత రామజోగయ్యశాస్త్రికి తెలుగులో ఇంతకన్నా మంచి పదాలు దొరకలేదేమో! ఈ పాటలో పోలీసుల సేవల గురించి తెలుపలేదు’ అని పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు సమర్థిస్తుంటే మరికొందరు ‘అది సినిమా సర్‌’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఈసారి బాగా రాస్తా: రామజోగయ్యశాస్త్రి

ఈ పాట గురించి ఓ నెటిజన్‌ పెట్టిన ట్వీట్‌కి రామజోగయ్యశాస్త్రి స్పందించారు. ‘మీ స్థాయి సాహిత్యం కాదు అన్న’ అని సదరు నెటిజన్‌ అనగా ‘ఈసారి బాగా రాస్తా తమ్ముడు ప్లీజ్‌’ అని సమాధానం ఇచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని