Priyamani- Mustafa raj : ముస్తఫా నేనూ అన్యోన్యంగా ఉన్నాం: ప్రియమణి
వ్యాపారవేత్త ముస్తఫారాజ్‌తో తన దాంపత్య జీవితం ఎంతో ఆనందంగా కొనసాగుతుందని నటి ప్రియమణి తెలిపారు. ముస్తఫాకు తనంటే ఎంతో ఇష్టమని ఆమె అన్నారు....
ముంబయి: వ్యాపారవేత్త ముస్తఫారాజ్‌తో తన దాంపత్య జీవితం ఎంతో ఆనందంగా కొనసాగుతోందని నటి ప్రియమణి అన్నారు. ముస్తఫాకు తనంటే ఎంతో ఇష్టమని ఆమె పేర్కొన్నారు. ప్రియమణి-ముస్తఫారాజ్‌ల వివాహం చట్టపరంగా చెల్లదంటూ ఆయన మొదటిభార్య ఆయేషా బుధవారం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ప్రియమణి స్పందించారు.
‘ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న బంధం మరింత బలపడాలంటే.. వాళ్లిద్దరూ పరస్పరం ప్రేమగా మాట్లాడుకోవాలి. బిజీగా ఉన్నప్పటికీ తన ప్రియమైన వారికోసం కొంతసమయాన్ని కేటాయించాలి. ముస్తఫాతో నా బంధం మరింత ధృడంగా మారడానికి కారణం కూడా అదే. మేమిద్దరం ఎంత బిజీగా ఉన్నా.. మాకంటూ సమయం కేటాయించుకుని మాట్లాడుకుంటాం. వ్యాపారపనుల నిమిత్తం ఇటీవల ముస్తఫా అమెరికా వెళ్లారు. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ప్రతిరోజూ సాయంత్రం నాకు వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాడు. అలాగే, నేను కూడా షూటింగ్స్‌లో ఉన్నా తన కోసం సమయం కేటాయిస్తాను. ఒకవేళ ఎప్పుడైనా ఇద్దరికీ సమయం కుదరనప్పుడు.. ఓ చిన్న మెస్సేజైనా పెట్టుకుంటాం. కాబట్టి ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా.. మా మధ్య ఉన్న అనుబంధం ఎప్పటికీ చెరిగిపోదు’ అని ప్రియమణి వ్యాఖ్యానించారు.
నటిగా రాణిస్తున్న తరుణంలోనే 2017లో ప్రముఖ వ్యాపారవేత్త ముస్తఫారాజ్‌ని ప్రియమణి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే తనకు విడాకులివ్వకుండా ప్రియమణి మెడలో ఆయన మూడు ముళ్లు వేశారంటూ ఆయేషా తాజాగా చేసిన ఆరోపణలు వైరల్‌గా మారాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
టికెట్ అడిగారని.. చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..
-
India News
SJM: సంపన్నులకు పన్ను రాయితీ కాదు.. వారి పాస్‌పోర్టులు రద్దు చేయాలి : ఎస్జేఎం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Nellore: కోటంరెడ్డిని తప్పించి.. నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డికి బాధ్యతలు
-
Movies News
Chiranjeevi: ఉదారత చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఏకంగా రూ.5 లక్షలు ఆర్థికసాయం
-
General News
ED: మద్యం కుంభకోణం మనీలాండరింగ్ కేసు.. ఈడీ ఛార్జిషీట్లో కేజ్రీవాల్, కవిత పేర్లు