PUSHPA: పుష్పరాజ్‌.. జోరు

అల్లు అర్జున్‌.. సుకుమార్‌ల కలయికలో రూపొందుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక కథానాయిక. ఫహాద్‌ ఫాజిల్‌, సునీల్‌ తదితరులు కీలక పాత్రలు

Updated : 22 Nov 2021 07:15 IST

అల్లు అర్జున్‌.. సుకుమార్‌ల కలయికలో రూపొందుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక కథానాయిక. ఫహాద్‌ ఫాజిల్‌, సునీల్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర తొలి భాగం ‘పుష్ప: ది రైజ్‌’ పేరుతో డిసెంబర్‌ 17న   ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే నిర్మాణాంతర పనులను చకచకా పూర్తి చేస్తోంది చిత్ర బృందం. బన్నీ ప్రస్తుతం తన పాత్రకు డబ్బింగ్‌ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు ట్విటర్‌ వేదికగా తెలియ జేశాయి. దీనికి సంబంధించి అల్లు అర్జున్‌ స్టూడియోలో డబ్బింగ్‌ చెబుతున్న ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ‘‘డబ్బింగ్‌ పనులు ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నాయి. వెండితెరపై పుష్పరాజ్‌ తన లాంగ్వేజ్‌తో.. బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకుంటాడు’’ అని ఆ వీడియోకి ఓ వ్యాఖ్యను జత చేశారు. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోన్న చిత్రమిది. బన్నీ ఇందులో పుష్పరాజ్‌ అనే స్మగ్లర్‌గా మాస్‌ అవతారంలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని