Ide Maa Katha: మన కోరికలో నిజాయతీ ఉంటే ఎప్పటికైనా నెరవేరుతుంది: శ్రీకాంత్‌

ఇదే మా కథ ట్రైలర్‌ వచ్చేసింది

Updated : 07 Dec 2022 17:00 IST

హైదరాబాద్‌: ‘మన కష్టానికి కారణం మనిషైతే ద్వేషిస్తాం.. దేవుడైతే విధిరాత అనుకుంటాం. మన కోరికలో నిజయాతీ ఉంటే ఎప్పటికైనా అది నెరవేరుతుంది’ అని అంటున్నారు నటుడు శ్రీకాంత్‌. ఆయన.. సుమంత్‌ అశ్విన్‌, భూమిక, తాన్య హోప్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇదే మా కథ’. రహదారి ప్రయాణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి గురుపవన్‌ దర్శకత్వం వహించారు. అక్టోబర్‌ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘ఇదే మా కథ’ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. హైదరాబాద్‌ నుంచి లద్దాఖ్‌ వరకు సాగే ప్రయాణం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. పాతికేళ్ల క్రితం దూరమైన ప్రేమను తిరిగి పొందడానికి లద్దాఖ్‌ వెళ్లే ట్రావెలర్‌గా శ్రీకాంత్‌ కనిపించనున్నాడు. సుమంత్‌ అశ్విన్‌-భూమిక బైక్‌ రైడింగ్‌ని ఇష్టపడే పాత్రల్లో నటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని