TS News: సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి అస్వస్థత

ప్రముఖ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో రెండు రోజుల నుంచి బాధపడుతున్న ఆయన్ను..

Updated : 27 Nov 2021 21:13 IST

హైదరాబాద్‌: ప్రముఖ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో రెండు రోజుల నుంచి బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి సిరివెన్నెలకు కిమ్స్‌ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కొన్ని రోజుల నుంచి సిరివెన్నెల న్యూమోనియాతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆ కారణంగానే అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు సిరివెన్నెలను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని