
Pushpa:ఈ విషయంలో ‘ఆర్ఆర్ఆర్’ను ‘పుష్ప’రాజ్ ఫాలో అయ్యాడా?
ఇంటర్నెట్‌డెస్క్: తెలుగు చిత్రపరిశ్రమలో వరుస సినిమాల సందడి నెలకొంది. డిసెంబరు మొదటి వారం నుంచి సంక్రాంతి వరకూ అగ్ర హీరోల సినిమాలతో ఈ జోష్ మరింత పెరగనుంది. ఇప్పటికే ఆయా సినిమాలు ప్రచార కార్యక్రమాలను మరింత ముమ్మరం చేశాయి. గ్లింప్స్, టీజర్, ట్రైలర్ అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం హోరెత్తిపోతోంది. అయితే ఓ విషయంలో ‘ఆర్ఆర్ఆర్’(RRR)ను పుష్పరాజ్ ఫాలో అయ్యాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
అల్లు అర్జున్(Allu Arjun) కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’(Pushpa). రష్మిక కథానాయిక. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ టీజ్ అంటూ చిత్రం బృందం ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. కేవలం 26 సెకన్లు మాత్రమే నిడివి ఉన్న ఈ ట్రైలర్ టీజ్‌లో ‘పుష్ప’లో ఉన్న పాత్రలన్నింటినీ చూపించారు. అన్ని పాత్రలు తళుక్కుమని మెరిసి వెళ్లిపోతాయి. ఎవరు ఏ పాత్ర పోషించారో తెలియాలంటే మాత్రం ప్లేబ్యాక్ స్పీడ్‌ను 0.25xకు తగ్గించి చూస్తేనే అన్ని పాత్రలు కనపడతాయి. అలా చూసిన వారందరూ 26 సెకన్లలో ఇన్ని పాత్రలను చూపించారా? అని ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఇలాంటి ట్రెండీ ప్రచారాన్ని ఇంకాస్త ముందుగానే ‘ఆర్ఆర్ఆర్’(RRR) మొదలు పెట్టింది. నవంబరు 1న ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందం ‘గ్లింప్స్’ పేరుతో ఓ వీడియోను పంచుకుంది. 46 సెకన్ల నిడివి మాత్రమే ఉన్న వీడియోలో ‘ఆర్ఆర్ఆర్’ అద్భుత ప్రపంచాన్ని చూపించారు. అయితే, ఇందులో కూడా ఎవరు? ఏ పాత్రను పోషించారో తెలియాలంటే మాత్రం ఈ వీడియో ప్లేబ్యాక్ స్పీడ్‌ను 0.25xకు తగ్గించి చూస్తేనే కనపడతారు. మరి ఈ విషయంలో ‘ఆర్ఆర్ఆర్’ ‘పుష్ప’రాజ్ ఫాలో అయినట్టే కనపడుతోంది.
అయితే, ఏ సినిమాకు అదే ప్రత్యేకం. రెండూ పాన్ ఇండియా సినిమాలే. రెండూ భారీ బడ్జెట్‌తో వస్తున్నవే. ‘పుష్ప’ డిసెంబరు 17న విడుదలవుతుండగా, ‘ఆర్ఆర్ఆర్’ జనవరి 7న ప్రేక్షకుల ముందుకురానుంది. అన్నట్లు డిసెంబరు 6న ‘పుష్ప’ ట్రైలర్, ఆ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ విడుదల కానున్నాయి. ఈ రెండింటి కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
► Read latest Cinema News and Telugu News