The Gray Man: ది గ్రే మ్యాన్‌ ఆసక్తికర అవకాశం

తమిళ కథానాయకుడు ధనుష్‌ హాలీవుడ్‌లో ‘ది గ్రే మ్యాన్‌’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకులు రస్సో బ్రదర్స్‌ తెరకెక్కిస్తున్నారు. రియాన్‌ గోస్లింగ్‌, క్రిస్‌ ఎవాన్స్‌, అనా డి అర్మాస్‌, జెస్సికా హెన్విక్‌ తదితర హాలీవుడ్‌

Updated : 12 Dec 2021 08:01 IST

మిళ కథానాయకుడు ధనుష్‌ హాలీవుడ్‌లో ‘ది గ్రే మ్యాన్‌’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకులు రస్సో బ్రదర్స్‌ తెరకెక్కిస్తున్నారు. రియాన్‌ గోస్లింగ్‌, క్రిస్‌ ఎవాన్స్‌, అనా డి అర్మాస్‌, జెస్సికా హెన్విక్‌ తదితర హాలీవుడ్‌ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది ప్రస్తుతం శరవేగంగా   చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ చిత్ర అనుభవాలను ధనుష్‌ ఇటీవల ఓ జాతీయ మీడియాతో పంచుకున్నారు. ‘‘ఇంత గొప్ప సినిమాలో భాగమవుతానని నేనెప్పుడూ ఊహించలేదు. నాకిదొక ఆసక్తికర అవకాశం. ఈ చిత్రంతో నటుడిగా నేనెన్నో కొత్త పాఠాలు నేర్చుకునే అవకాశమొచ్చింది. అందుకే ఈ ప్రయాణం నాకు చాలా నచ్చింది. త్వరలో తిరిగి చిత్రీకరణలో పాల్గొంటా’’ అన్నారు ధనుష్‌. ఈ సందర్భంగా ఆయన తన సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ.. ‘‘నేనెప్పుడూ అవకాశాల వెంటపడలేదు. నా వద్దకు వచ్చినవి వచ్చినట్లు నిజాయితీగా చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ ప్రయాణం ఎక్కడికి దాకా వెళ్తుందన్నది దేవుడిపై ఆధారపడి ఉంది. ఆయన ఏ వైపు నడిపిస్తే ఆ వైపు వెళ్తాన’’ని చెప్పుకొచ్చారు. మార్క్‌ గ్రీనీ రాసిన ఓ నవల ఆధారంగా విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌గా ‘ది గ్రే మ్యాన్‌’ను ముస్తాబు చేస్తున్నారు. ఇది త్వరలో ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని