
MAA Elections: ప్రముఖ హోటల్‌లో నరేశ్ పార్టీ.. వైరల్‌గా మారిన ఇన్విటేషన్
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు, నటుడు నరేశ్ వీకెండ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో తన తోటి నటీనటులకు ఆయన పార్టీ ఇవ్వనున్నారట. ఇందుకు సంబంధించిన ఓ మెస్సేజ్ వైరల్‌గా మారింది. నగరంలోని దసపల్లా ఫోరమ్ హాల్‌లో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి పార్టీ జరగనుందని.. ఈ మేరకు శుక్రవారం అందరికీ ఆహ్వానం అందుతుందంటూ నరేశ్ విజయ కృష్ణ పేరుతో ఓ వాట్సాప్ మెస్సేజ్ పెట్టారు.
మరికొన్ని రోజుల్లో ‘మా’ ఎన్నికలు జరగనుండగా.. ఈ వాట్సాప్ మెస్సేజ్ ఇప్పుడు తెలుగు చిత్రసీమలో హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు గత నెల 29న నాగార్జున పుట్టినరోజుని పురస్కరించుకుని ‘బిగ్‌బాస్’ కంటెస్టెంట్‌లందరికీ ప్రకాశ్‌రాజ్ ఆఫీస్‌లో పార్టీ ఇస్తారని గతంలో ఓ మెస్సేజ్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. సభ్యులను ప్రసన్నం చేసుకోవడానికే ఇలా, ఒకరి తర్వాత మరొకరు పార్టీలు ఇస్తున్నారని సమాచారం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.