Indian2: ‘ఇండియన్‌ 2’ తిరిగి సెట్స్‌పైకి!

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో తెర  కెక్కుతోన్న చిత్రం ‘ఇండియన్‌ 2’. ఈ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌, శంకర్‌ మధ్య తలెత్తిన సమస్యల కారణంగా ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. ఈ వివాదం కోర్టు వరకూ

Updated : 30 Oct 2021 09:32 IST

మల్‌హాసన్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో తెర  కెక్కుతోన్న చిత్రం ‘ఇండియన్‌ 2’. ఈ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌, శంకర్‌ మధ్య తలెత్తిన సమస్యల కారణంగా ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. ఈ వివాదం కోర్టు వరకూ  వెళ్లిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు శంకర్‌, చిత్ర నిర్మాణ సంస్థ మధ్య చర్చలు సఫలం అయినట్టు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్టు చిత్రబృందం భావిస్తున్నట్టు తెలుస్తోంది. రామ్‌చరణ్‌తో తెరకెక్కిస్తున్న చిత్రంతో పాటు, ‘అన్నియన్‌’ హిందీ రీమేక్‌ను శంకర్‌ తెరకెక్కించడానికి కూడా లైకా ప్రొడక్షన్‌ అభ్యంతరం పెట్టకుండా ఒప్పుకొన్నట్టు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని