Chiranjeevi: చిరంజీవికి జోడీగా?

నటి శ్రుతిహాసన్‌ తెలుగులో మళ్లీ బిజీ అవుతోంది. ఓవైపు ప్రభాస్‌తో కలిసి ‘సలార్‌’లో సందడి చేస్తున్న ఈ అమ్మడు.. మరోవైపు బాలకృష్ణ చిత్రంలోనూ నటించేందుకు అంగీకారం తెలిపింది. ఇప్పుడామె చిరంజీవి సరసన నటించే

Updated : 07 Jan 2022 07:25 IST

టి శ్రుతిహాసన్‌ తెలుగులో మళ్లీ బిజీ అవుతోంది. ఓవైపు ప్రభాస్‌తో కలిసి ‘సలార్‌’లో సందడి చేస్తున్న ఈ అమ్మడు.. మరోవైపు బాలకృష్ణ చిత్రంలోనూ నటించేందుకు అంగీకారం తెలిపింది. ఇప్పుడామె చిరంజీవి సరసన నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం చిరు హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం కోసం చిత్ర బృందం శ్రుతిని సంప్రదించినట్లు తెలిసింది. చిత్ర కథ.. ఆమె పాత్ర నచ్చడంతో ఈ సినిమా చేసేందుకు శ్రుతిహాసన్‌ అంగీకరించినట్లు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం కోసం ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని