
Updated : 08 Oct 2021 07:14 IST
Maheshbabu: వచ్చే నెలలోనే...
మహేష్ బాబు - త్రివిక్రమ్ కలయికలో సినిమాకోసం రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెలాఖరు నుంచే ఆ చిత్రం పట్టాలెక్కనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం మహేష్‌బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. నవంబర్‌లోనే ఆ చిత్రం పూర్తవ్వనున్నట్టు సమాచారం. ఆ వెంటనే కొత్త చిత్రం కోసం రంగంలోకి దిగేందుకు మహేష్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కనుంది ఆ చిత్రం. మహేష్ - త్రివిక్రమ్ కలయికలో ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత వస్తున్న సినిమా ఇది. ఇందులో మహేష్ లుక్ విభిన్నంగా ఉంటుందని సమాచారం. ఆయనకి జోడీగా పూజాహెగ్డే నటిస్తుంది.
Tags :