Harihara Veeramallu: పవన్‌ కోసం నర్గీస్‌?

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ కోసం బాలీవుడ్‌ భామ నర్గీస్‌ ఫక్రీ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. క్రిష్‌ దర్శకత్వంలో పీరియాడిక్‌ కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమె

Published : 21 Dec 2021 16:01 IST

వన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ కోసం బాలీవుడ్‌ భామ నర్గీస్‌ ఫక్రీ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. క్రిష్‌ దర్శకత్వంలో పీరియాడిక్‌ కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమె యువరాణిగా సందడి చేయనున్నట్టు సమాచారం. మొదట ఈ పాత్ర కోసం జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ని ఎంపిక చేసుకున్నారు. అయితే ఆమె డేట్స్‌ సర్దుబాటు కాకపోవడంతో, నర్గీస్‌ ఫక్రీని సంప్రదించి ఆమెని ఒప్పించారనేది ఫిల్మ్‌నగర్‌ వర్గాల మాట. త్వరలోనే ఆమె సెట్స్‌లో అడుగుపెడతారని తెలుస్తోంది. మొఘలాయిల కాలం నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం పవన్‌కల్యాణ్‌ ప్రత్యేకంగా యుద్ధ విద్యల్లో తర్ఫీదు కూడా పొందారు. ఆయన ఇందులో ఓ బందిపోటుగా కనిపిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని