Prabhas: తొలిసారి పోలీస్‌గా...

ప్రభాస్‌ పోలీస్‌ పాత్రలో సందడి చేయనున్నారు. ఆ విషయాన్ని నిర్మాత భూషణ్‌కుమార్‌ స్వయంగా వెల్లడించారు. మాస్‌ కథానాయకుడిగా... జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రభాస్‌ ఇప్పటిదాకా తన కెరీర్‌లో పోలీస్‌ పాత్ర చేయలేదు.

Updated : 05 Jan 2022 07:14 IST

ప్రభాస్‌ పోలీస్‌ పాత్రలో సందడి చేయనున్నారు. ఆ విషయాన్ని నిర్మాత భూషణ్‌కుమార్‌ స్వయంగా వెల్లడించారు. మాస్‌ కథానాయకుడిగా... జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రభాస్‌ ఇప్పటిదాకా తన కెరీర్‌లో పోలీస్‌ పాత్ర చేయలేదు. ‘స్పిరిట్‌’తో తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి, లాఠీ ఝుళిపించనున్నారు. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్‌ కథానాయకుడిగా ‘స్పిరిట్‌’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రభాస్‌ 25వ సినిమాగా, పాన్‌ ఇండియా స్థాయిలో భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని