
RamCharan: రామ్‌చరణ్ పారితోషికం @ రూ.100 కోట్లు..?
హైదరాబాద్: మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ (RamCharan) వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకెళ్తున్నారు. ఓవైపు ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘ఆచార్య’ రిలీజ్‌లతో బిజీగా ఉన్న ఆయన మరో రెండు ప్రాజెక్ట్‌లు కూడా ఓకే చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. రామ్‌చరణ్ తన పారితోషికాన్ని పెంచినట్లు తెలుస్తోంది. ఈ మేరకు శంకర్‌తో చేస్తోన్న ‘RC15’, గౌతమ్ తిన్ననూరితో చేయనున్న ‘RC16’ ప్రాజెక్ట్‌లకు చరణ్ భారీగా రూ.100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, ప్రభాస్ సైతం ‘స్పిరిట్’ సినిమా కోసం రూ.100 కోట్లు అందుకుంటున్నారని గతంలో వార్తలు వచ్చాయి. ప్రభాస్ తర్వాత అంత ఎక్కువ మొత్తాన్ని అందుకుంటున్న నటుడు రామ్‌చరణేనని నెటిజన్లు చెప్పుకొంటున్నారు. ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
► Read latest Cinema News and Telugu News