RRR: సినీ ప్రియులకు షాక్‌..‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వాయిదా..?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎంతగానో ఎదురుచూస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా, ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందుతున్న కారణంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ని వాయిదా వేసే...

Published : 01 Jan 2022 11:33 IST

హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎంతగానో ఎదురుచూస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో కరోనా, ఒమిక్రాన్‌ వ్యాప్తి పెరుగుతోన్న నేపథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ని వాయిదా వేసే ఆలోచనలో టీమ్‌ ఉన్నట్లు సమాచారం. కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని సినీ పరిశ్రమలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ తారక్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కాకపోతే దేశంలో ఒమిక్రాన్‌ తీవ్రత పెరుగుతుండటంతో ఇప్పటికే దిల్లీలో థియేటర్లు మూతపడ్డాయి. ముంబయిలో సినిమాహాళ్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. మరోవైపు ఏపీలోనూ టికెట్‌ ధరల వ్యవహారం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ని వాయిదా వేయాలని చిత్రబృందం యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ‘రాధేశ్యామ్‌’ కూడా వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాయిదాల పర్వం కొనసాగుతోన్న తరుణంలో సినీ ప్రియులు నిరాశకు గురవుతున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘రాధేశ్యామ్‌’ కోసం వెయిటింగ్‌ అంటూ పోస్టులు పెడుతున్నారు.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని