
RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రీరిలీజ్ ఈవెంట్.. హోస్ట్ ఎవరంటే?
హైదరాబాద్: ప్రమోషన్స్ విషయంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) చిత్ర బృందం ఫుల్ స్పీడ్ పెంచింది. ట్రైలర్ విడుదలైన వెంటనే దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ ప్రత్యేకంగా ప్రెస్‌మీట్‌లు నిర్వహించిన టీమ్ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ల కోసం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆదివారం ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ముంబయిలో జరగనుంది. ఇందు కోసం చిత్రబృందం భారీగానే ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ (Salmankhan) ఈ వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత కరణ్‌జోహార్ (KaranJohar).. ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్‌తో రాపిడ్ ఫైర్ రౌండ్ నిర్వహించనున్నారని సమాచారం. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
మరోవైపు.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రీరిలీజ్ వేడుక కోసం ముంబయిలోని ఫిల్మ్‌సిటీలో ఏర్పాట్లు జరుగుతోన్న ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వేడుక కోసం రామ్‌చరణ్ (RamCharan) ఇప్పటికే ముంబయి చేరుకున్నారు. రామ్‌చరణ్-తారక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా కోసం నిర్మాత డీవీవీ దానయ్య రూ.450 కోట్లు ఖర్చుపెట్టినట్లు సమాచారం.
► Read latest Cinema News and Telugu News