Ishq: ఆసక్తిగా ‘ఇష్క్‌’ రిలీజ్‌ ట్రైలర్‌

తేజ సజ్జా, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ జంటగా నటించిన చిత్రం ‘ఇష్క్‌’. నాట్‌ ఏ లవ్‌ స్టోరీ అనేది ఉపశీర్షిక. యస్‌.యస్‌. రాజు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published : 27 Jul 2021 13:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తేజ సజ్జా, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ జంటగా నటించిన చిత్రం ‘ఇష్క్‌’. నాట్‌ ఏ లవ్‌ స్టోరీ అనేది ఉపశీర్షిక. యస్‌.యస్‌.రాజు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రిలీజ్‌ ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. రొమాంటిక్‌, థ్రిల్లింగ్‌ సన్నివేశాలతో తీర్చిదిద్దిన ఈ వీడియో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ‘నాకొక ఫైవ్‌ మినిట్స్‌ కావాలి’ అని కీలక సన్నివేశంలో తేజ చెప్పిన డైలాగ్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. మరి వీళ్ల ప్రేమ కథేంటి? వాళ్లకి ఎదురైన సంఘటన ఏమిటో తెలుసుకోవాలంటే.. సినిమా చూసి తీరాల్సిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఆర్‌.బి. చౌదరి సమర్పిస్తున్నారు. ఎన్వీ ప్రసాద్‌, పారస్‌ జైన్‌, వాకాడ అంజన్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్‌ సంగీతం అందించారు. ఏప్రిల్‌లోనే విడుదలకావాల్సిన ఈ సినిమా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు, ట్రైలర్‌ విశేషంగా అలరించాయి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని