Gully Rowdy: ‘ఐటమ్‌ సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’.. విన్నారా!

సందీప్‌ కిషన్, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘గల్లీరౌడీ’. జి.నాగేశ్వర రెడ్డి దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published : 22 Jul 2021 18:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సందీప్‌ కిషన్, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘గల్లీరౌడీ’. జి.నాగేశ్వర రెడ్డి దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘చాంగురే ఐటెమ్‌ సాంగ్‌రే’ అనే ప్రత్యేకగీతాన్ని విడుదల చేసింది నాయిక రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ‘ఐటెమ్‌ సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ క్యాప్షన్‌తో వచ్చిన ఈ గీతం శ్రోతల్ని ఉర్రూతలూగించేలా ఉంది. భాస్కరభట్ల రచించిన ఈ గీతాన్ని మంగ్లీ ఆలపించారు. సాయి కార్తీక్‌ స్వరాలు సమకూర్చారు. ఈ లిరికల్ వీడియోలో సాంగ్‌ చిత్రీకరణని చూపించారు. సందీప్‌తోపాటు పోసాని కృష్ణమురళి, వైవా హర్ష సందడి చేశారు. ఈ సినిమాలో సందీప్‌ సరసన నేహా శెట్టి నటించింది. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా సంయుక్తంగా నిర్మించాయి. కిడ్నాప్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. ఆద్యంతం నవ్వులు పంచేందుకు సిద్ధమవుతుంది. వెన్నెల కిశోర్‌, రాజేంద్ర ప్రసాద్‌. పోసాని, హర్ష కీలక పాత్రల్లో కనిపించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని