Bigg Boss Telugu 5: ‘బిగ్‌బాస్‌’ మధురజ్ఞాపకం.. షణ్ముఖ్‌ అమితానందం 

బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తున్న ‘బిగ్‌బాస్‌’ కార్యక్రమం తుది దశకు చేరుకుంది.

Published : 14 Dec 2021 13:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తోన్న ‘బిగ్‌బాస్‌’ కార్యక్రమం తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో టాప్‌ 5 కంటెస్టెంట్స్‌ జాబితాలో నిలిచిన ఇంటిసభ్యులకు (శ్రీరామ్‌, సన్నీ, మానస్‌, షణ్ముఖ్‌, సిరి) ‘బిగ్‌బాస్‌’ మధురజ్ఞాపకాలను అందించాడు. ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లో తమ ప్రయాణం ఎలా సాగిందో గుర్తుచేశాడు. తొలి ఎపిసోడ్‌ నుంచి ఇప్పటి వరకూ ఈ ఐదుగురు ఎలా ఉన్నారు? గేమ్‌ను ఎంత బాగా ఆడారు? తదితర విషయాల్ని ఫొటోలతో కళ్లకు కట్టినట్టు చూపించాడు. ఈ క్రమంలో తన దృశ్యాల్ని చూసుకున్న షణ్ముఖ్‌ ఎంతో ఆనందించాడు. తన అల్లరిని గుర్తుచేసుకుని మురిసిపోయాడు. ‘ఎంత మంది మిమ్మల్ని నామినేట్‌ చేసినా అధైర్య పడకుండా ఆటను ఫినాలే వరకూ తీసుకొచ్చారు’ అని ‘బిగ్‌బాస్‌’ షణ్ముఖ్‌కి కితాబిచ్చాడు. ‘థ్యాంక్‌ యు బిగ్‌బాస్‌’ అంటూ షణ్ముఖ్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని