
Published : 20 Aug 2021 20:36 IST
IVNR: ‘తీయ్ తీయ్ బండి తీయ్’.. అలరిస్తున్న ప్రమోషనల్ సాంగ్
ఇంటర్నెట్ డెస్క్: సుశాంత్ కథానాయకుడిగా ఎస్. దర్శన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రచార గీతాన్ని నటుడు నాగచైతన్య విడుదల చేశారు. వాహనదారులు, ట్రాఫిక్ పోలీసుల మధ్య సాగే సంభాషణలు ఎలా ఉంటాయో ఈ పాటలో వినిపించారు. ‘తీయ్ తీయ్ బండి తీయ్’ అంటూ సాగే ఈ గీతం ఆద్యంతం అలరిస్తోంది. సుశాంత్ డ్యాన్సు మెప్పిస్తోంది. రాహుల్ సిప్లిగంజ్ గానం విశేషంగా ఆకట్టుకుంటోంది. సురేశ్ గంగుల రచించిన ఈ పాటకి ప్రవీణ్ లక్కరాజు స్వరాలు సమకూర్చారు. రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్ల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, ప్రియదర్శి తదితరులు సందడి చేయనున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎం. సుకుమార్, కూర్పు: గ్యారీ బి.హెచ్.
ఇవీ చదవండి
Tags :