Published : 08 Aug 2021 16:41 IST

Jabardasth: వెంకీ కన్నీటికి కారణమేమిటి?

హైదరాబాద్‌: హైపర్‌ఆది, అభి, వెంకీ-తాగుబోతు రమేశ్‌, చలాకీ చంటి టీమ్‌ లీడర్లుగా ఈటీవీలో ప్రసారమవుతోన్న ఎంటర్‌టైన్‌మెంట్‌ షో ‘జబర్దస్త్‌’. అనసూయ వ్యాఖ్యాతగా రోజా, మనో న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ఈ షో ప్రతి గురువారం బుల్లితెర ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తోంది. కాగా, వచ్చేవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా బయటకు వచ్చింది. హైపర్‌ఆది స్కిట్‌ కోసం అభి, బుల్లెట్‌ భాస్కర్‌, నరేశ్‌ స్టేజ్‌పై మెరిశారు. భాస్కర్‌ని చూపించిన నరేశ్‌.. ‘ఇతనే మా గురువుగారు’ అని చెప్పగానే.. అభి వేసిన ప్రశ్నకు.. ‘ఎందుకులే అన్నా.. నేను గురువుగారు అంటాను. నువ్వు వెంటనే గురువుగారు గురువుగారు అంటూ గుండెలపై తన్నావు అంటావు’ అంటూ ఆది వేసిన పంచులతో అందరూ నవ్వులు పూయించారు. వరుస పంచులు, స్కిట్‌లతో కడుపుబ్బా నవ్వుకున్న న్యాయనిర్ణేతలు.. స్కిట్ అనంతరం వెంకీ కన్నీరు పెట్టుకోవడంతో ఆశ్చర్యపోయారు. ఏమైందని మనో ప్రశ్నించగా.. ‘చేసేది నేను.. చేయించింది నేను’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. వెంకీ ఎందుకు అంతలా బాధపడ్డారు? అసలు ఏం జరిగింది? అనేది తెలియాలంటే వచ్చే గురువారం వరకూ వేచి చూడాల్సిందే.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని