RRR: ‘RRR’ నుంచి మరో అప్‌డేట్‌.. బంగార్రాజులో నాగ చైతన్య

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌

Updated : 22 Nov 2021 19:09 IST

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచార కార్యక్రమాల వేగాన్ని పెంచారు. ఆర్ఆర్‌ఆర్‌ సోల్‌ యాంథమ్‌(RRR Soul Anthem) ‘జనని’ అంటూ సాగే పాటను విడుదల చేయనున్నట్లు దర్శకుడు రాజమౌళి తెలిపారు. పెద్దన్న కీరవాణి స్వరపరిచిన పాట భావోద్వేగంతో సాగుతుందంటూ ఓ పోస్టర్‌ను పంచుకున్నారు.


‘బంగార్రాజు’ నాగచైతన్య ఫస్ట్‌లుక్‌

నాగార్జున, నాగచైతన్య కీలక పాత్రల్లో నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘బంగార్రాజు’. కల్యాణ్‌ కృష్ణ దర్శకుడు. మంగళవారం నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో చైతూ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ తెరకెక్కుతోంది.

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని