Anudeep: స్టార్‌ హీరోతో ‘జాతిరత్నాలు’ డైరెక్టర్‌ టీమ్‌ అప్‌..!

‘జాతిరత్నాలు’తో మొదటి ప్రయత్నంలోనే దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేశారు అనుదీప్‌. కరోనా కారణంగా నిరాశతో ఉన్న ప్రేక్షకుల ముఖాలపై నవ్వులు పూయించిన....

Published : 01 Jan 2022 16:06 IST

హైదరాబాద్‌: ‘జాతిరత్నాలు’తో మొదటి ప్రయత్నంలోనే దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేశారు అనుదీప్‌. కరోనా కారణంగా నిరాశతో ఉన్న ప్రేక్షకుల ముఖాలపై నవ్వులు పూయించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టి సూపర్‌హిట్ టాక్‌ అందుకుంది. ఈ నేపథ్యంలోనే అనుదీప్‌ తదుపరి ప్రాజెక్ట్‌ కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈమేరకు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం తాను చేయనున్న కొత్త ప్రాజెక్ట్‌ని అనుదీప్‌ ప్రకటించారు. కోలీవుడ్‌ స్టార్‌ హీరో శివకార్తికేయన్‌తో ఓ విభిన్నమైన కథా చిత్రాన్ని ఆయన తెరకెక్కించనున్నారు. తెలుగు, తమిళం భాషల్లో ఈసినిమా ప్రేక్షకుల్ని అలరించనుంది. తమన్‌ స్వరాలు అందించనున్నారు. సురేశ్‌ ప్రొడెక్షన్స్‌, శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.

శివకార్తికేయన్‌ చిత్రాలకు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి మార్కెట్‌ ఉంది. ఆయన నటించిన పలు చిత్రాలు తమిళం, తెలుగులో ఒకే సమయంలో విడుదలై హిట్‌ అందుకున్నాయి. ముఖ్యంగా ‘రెమో’ చిత్రం ఆయన్ని తెలుగువారికి సుపరిచితుల్ని చేసింది. ఇటీవల ఆయన నటించిన ‘డాక్టర్‌’ సైతం ఇక్కడివారికి నచ్చింది.

Read latest Cinema News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని